header

Friday, 21 October 2016

Jangiri (జాంగిరి)

Jangiri  (జాంగిరి)

కావలసిన పదార్ధాలు :

మినపప్పు : కప్పు
బియ్యం : పావు కప్పు
పంచదార : ఆరు కప్పులు
కలర్ : టీ స్పూన్
యాలుకుల పొడి : టీ స్పూన్
నూనె : వేయించటానికి సరిపడ


తయారుచేయు విధానం :

1) మినపప్పు, బియ్యాన్ని విడివిడిగా సుమారు నాలుగుగంటలు నానబెట్టాలి.
2) మినపప్పుని కడిగి, బియ్యం కలిపి మెత్తగా రుబ్బాలి.
    (మరీగట్టిగాను కాదు, పల్చగాను కాదు) మధ్యస్తంగా వుండాలి.
3) దీనిలో కలర్ కలపాలి. 
4) ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒకగిన్నెలో పంచదార వేసి, కొద్దిగా నీళ్ళు కలిపి పాకం పట్టాలి. (తీగ పాకం  పట్టాలి)
5) పాకం వచ్చాక యాలుకల పొడి వేసి కలపాలి.
6) పక్క స్టవ్ వెలిగించి కళాయిలో నూనె వేడి చెయ్యాలి. 
7) నూనె కాగాక, ఒక గుడ్డకి మద్యలో చిన్న రంద్రం పెట్టి, దానిలో పిండిని వేసి అంచులు కలిపి పట్టుకొని రంద్రాన్ని వేలుతో మూసి వెయ్యాలి.
8) కాగుతున్న నూనెలో (రంద్రానికి అడ్డుగా వున్న వేలు తీసి) జాంగిరి ఆకారంలో పిండిని వెయ్యాలి.
9) బాగా వేగాక తీసి, వెంటనే పాకంలో వేయాలి, ఐదునిముషాలు వుంచి, తీసి వేరే పళ్ళెంలో పెట్టి చల్లారనివ్వాలి.
* అంతే జాంగిరీలు రెడి.www.srinainika.blogspot.com

Moong Dal (Pesara) Laddulu, పెసరు లడ్డు

Moong Dal (Pesara) Laddulu

 పెసరు లడ్డు

కావలసిన పదార్దాలు :
పెసర పప్పు _ఒక కప్పు 
పంచదార -ఒక కప్పున్నర 
నెయ్యి-పావుకప్పు 
యాలుకలు పొడి- టీ స్పూన్ 
జీడిపప్పులు – పది (నేతిలో వేయిన్చినవి ) 

తయారుచేయు విధానం

1) ముందుగా పెసర పప్పును దోరగా వేయించాలి.

2) వేయించిన పప్పును మిక్సిలో వేసి పిండిలా చెయ్యాలి.

3) స్టవ్ ఫై కళాయి పెట్టి పంచదార వేసి అర కప్పు నీళ్ళు వేసి పాకం పట్టాలి.

4) తీగ పాకం వచ్చాక మిక్సి చేసిన పెసర పిండిని వేసి కలపాలి.

5) ఇప్పుడు పంచదార పాకంలో పెసర పిండి ఉడుకుతుంది.

6) ఇది ముద్దలా అవ్వుతుండగా నెయ్యి వేసి కలపాలి.

7) కాసేపటికి కళాయి కి అంటుకోకుండా  ఈ ముద్ద విడిగా వస్తుంది.

8) ఇప్పుడు ఒక ప్లేటుకి నెయ్యి రాసి ఇలా తయారుయ్యిన పెసరు 

మిశ్రమాన్ని వేసి కాసేపు చల్లారనివ్వాలి 

9) కాస్త గోరు వెచ్చగా ఉండగానే చేతికి నెయ్యి రాసుకొని ఈ మిశ్రమాని కొద్దిగా తీసుకోని లాడ్డులుగా చుట్టాలి.

10) అలా అన్ని చుట్టాక ఫై న జీడిపప్పులు అలంకరిస్తే సరి పెసరు లడ్డు రెడి .

Samosa (సమోసా )


Samosa  (సమోసా )

కావలసిన పదార్దాలు :
మైదా : పావు కిలో
బంగాళదుంపలు : మూడు
పచ్చిబఠాని : అర కప్పు
ఉప్పు : సరిపడా
పచ్చిమిర్చి ముక్కలు : టీ స్పూన్
ఉల్లి పాయ ముక్కలు : అర కప్పు
కొత్తిమీర తరుగు : కొద్దిగా
బేకింగు సోడా : పావు టీ స్పూన్
నూనె : వేయించటానికి సరిపడా
కారం : అర టీ స్పూన్
వెన్న : ఒక టీ స్పూన్ 


తయారుచేయు విధానం :


1) బంగాళదుంపలు ఉడకబెట్టి పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా 
    చేసుకోవాలి.
2) మైదాలో కొంచెం ఉప్పు, వెన్న, సోడా వేసి కొద్దిగా నీళ్ళు కలిపి ముద్దలా 
     చేసి పావు గంట పక్కన ఉంచాలి.
3) స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కొద్దిగా నూనె వేడిచేసి ఉల్లి ముక్కలు, మిర్చి 
     ముక్కలు, పచ్చిబఠాని వేసి వేయించాలి.
4) ఇప్పుడు అల్లం పేస్టూ, ఉప్పు, కారం, బంగాళదుంప ముక్కలు వేసి కలిపి 
     పక్కన పెట్టాలి.
5) ఇప్పుడు పిండిని చిన్నచిన్నచపాతిలా చేసుకొని రెండు ముక్కలుగా కట్ 
     చేసి ఒక్కోదాన్ని సమోసాగా మడిచి, దానిలో బంగాళదుంప మిశ్రమాన్ని 
     పెట్టి అంచులు మూసివేయ్యాలి. 
6) స్టవ్ మీద కళాయిపెట్టి నూనె వేడి చెయ్యాలి. నూనె కాగిన తరువాత చేసి 
     పెట్టిన సమోసాలు వేసి రెండు ప్రక్కలా దోరగావేయించి తియ్యాలి.


* అంతే సమోసాలు రెడీ.www.srinainika.blogspot.com

Ravva Dosa(Suji)


(Suji) Ravva Dosa

కావలసిన పదార్ధాలు :
 
మినపప్పు : పావు కేజీ
బియ్యం : పావు కేజీ
రవ్వ : పావు కేజీ
 ఉప్పు : తగినంత
పచ్చిమిర్చి పేస్టూ : ఒక టీ స్పూన్  



తయారు చేయు విధానం :

1) మినపప్పుని మూడు గంటల ముందు నానపెట్టాలి.
2) తరువాత నానిన పప్పుని బాగా కడిగి పొట్టు తియ్యాలి.
3) అలా కడిగిన మినపప్పుమెత్తగా రుబ్బాలి.  
 4) దీనిలో రవ్వ కలిపి కొంచెం నీరు, సరిపడా ఉప్పు, పచ్చిమిర్చి పేస్టూ వేసి  బాగా కలిపి ఒక గంటపక్కన పెట్టాలి.
5) ఇప్పుడు స్టవ్ వెలిగించి అట్లరేకు పెట్టి కాస్త నూనె వేసి దోసె వెయ్యటమే.
6) కావాలంటే ఉల్లి, మిర్చి, అల్లం, జీలకర్ర వేసుకోవచ్చు. లేదంటే ప్లేన్ దోసె వేసుకోవచ్చు. 

సొరచేపపొడి కూర

సొరచేపపొడి కూర
 
కావలసిన పదార్ధాలు :
 
సొర చేప : అరకిలో
కారం : 2 టీ స్పూన్ లు
దనియాల పొడి : 1 టీ స్పూన్
జీలకర్ర పొడి, ఉప్పు : సరిపడా
కరివేపాకు : మూడు రెబ్బలు
అల్లంవెల్లుల్లి (చిన్న ముక్కలుగా కట్ చెయ్యాలి)
పసుపు : 1 టీ స్పూన్
ఉల్లిపాయలు : రెండు
పచ్చిమిర్చి : మూడు
గరం మసాల : 1 టీ స్పూన్
నూనె : కప్పు
 
 
తయారుచేయు విధానం :
 
1) సొరచేప ముక్కలు వేడి నీళ్ళల్లో వేసి పది నిముషాలు ఉంచితే, చేప మెత్త 
    బడుతుంది.
2) ఇప్పుడు చేపముక్కల మీద పొర తీసివెయ్యాలి, అలా చేసిన తరువాత 
    చేప ముక్కలు పొడిపొడిగా చిదిపి పక్కన పెట్టాలి.
3) ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండిలో నూనె వేసి కాగిన తరువాత అల్లం
    ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసి వేగాక, ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి 
    ముక్కలు వేసి వేపాలి.
4) వేగిన తరువాత ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు, కరివేపాకు వేసి  
    వేగాక, సిద్దం చేసిన చేపముక్కలపొడి వేసి కాసేపు వేపి గరంమసాల, 
    కొత్తిమిర వేసి కలపాలి 
   
* అంతే గుమగుమలాడే సొరచేపలపొడి కూర రెడి.

Cassava Tomato Curry, Penadalam Shrimp Tomato Curry (పెండలం టమాటా కర్రి)

Cassava Tomato Curry Penadalam Shrimp Tomato Curry (పెండలం టమాటా కర్రి)

BY:www.srinainika.blogspot.com
కావలసిన పదార్ధాలు :


పెండలం దుంప : పావుకేజీ
టమాటాలు : పెద్దవి రెండు
ఉల్లిపాయలు : మూడు
పచ్చిమిర్చి : రెండు
కారం : ఒకటిన్నర టీ స్పూన్
ఉప్పు : సరిపడ
పసుపు : అర టీ స్పూన్
నూనె : రెండు టేబుల్ స్పూన్లు
చింతపండు : కొద్దిగా
అల్లంవెల్లుల్లి పేస్టు : 1 టీ స్పూన్
కరివేపాకు, కొత్తిమిర : కొద్దిగా 


తయారుచేయు విధానం :www.srinainika.blogspot.com


1) పెండలం చెక్కు తీసి ముక్కలుగా కొయ్యాలి.
2) ఉల్లి, పచ్చిమిర్చి, టమాటా ముక్కలుగా కొయ్యాలి.
3) చింతపండు నీళ్ళలో నానబెట్టాలి.
4) ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయిలో నూనె వేడిచేసి ఉల్లిపాయలు, 
    పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగనివ్వాలి.
5) తరువాత అల్లంవెల్లుల్లి వేసి వేగాక, టమాటా ముక్కలు వేసి కలిపి, ఒక 
    నిముషం ఉంచాలి.
6) పెండలం ముక్కలు, పసుపు, కారం, ఉప్పు వేసి కలిపి, కొద్దిగా నీళ్లువేసి 
    మూతపెట్టి ఐదునిముషాలు వుడకనివ్వాలి.
7) ఇప్పుడు చింతపండు రసం వేసి రెండు నిముషాలు ఉడకనివ్వాలి. 
8) మూతతీసి ఒకసారి కలిపి, కొత్తిమిర, కరివేపాకు వేసి కలిపి, మూతపెట్టి స్టవ్ 
    ఆపాలి.


* అంతే ఘుమఘుమలాడే పెండలం టమాటా కర్రి రెడి.
BY:www.srinainika.blogspot.com

Egg Brinjal Curry , Gudlu Vankaya Koora (గుడ్లు వంకాయలు కూర)

Egg Brinjal Curry , Gudlu Vankaya Koora (గుడ్లు వంకాయలు కూర)BY:www.srinainika.blogspot.com

కావలసిన పదార్దాలు :

గుడ్లు : ఆరు
వంకాయలు  :  పావుకేజీ
ఉల్లిపాయలు : రెండు
పచ్చిమిర్చి : మూడు
కారం : టీ స్పూన్
ఉప్పు : తగినంత
అల్లం వెల్లుల్లి పేస్టు : టీ స్పూన్
గరం మసాలా : అర టీ స్పూన్
చింతపండు : నిమ్మకాయంత
కరివేపాకు : రెండు రెమ్మలు
పసుపు : పావు టీ స్పూన్
నూనె : మూడు టేబుల్ స్పూన్లు
కొత్తిమీర : కొద్దిగా

తయారుచేయు విధానం :

1) గుడ్లు ఉడికించి వలిచి పక్కన పెట్టాలి. వంకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చెయ్యాలి.
2) స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి. నూనె కాగాక గుడ్లుకి అక్కడక్కడ గాట్లుపెట్టి వేయించి తియ్యాలి.
3) అదే నూనెలో ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేయించాలి. తరువాత అల్లం వేల్లుల్లి పేస్టు వేసి వేగిన తరువాత వంకాయ ముక్కలు కలిపి ఒక నిముషం  మూతపెట్టాలి.
4) ఇప్పుడు మూతతీసి ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి కొద్దిగా నీళ్ళు పోసి మూతపెట్టి ఐదు నిముషాలు ఉడకనివ్వాలి. తరువాత చింతపండు రసం గుడ్లు వేసి మరో ఐదునిముషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు మసాలా, కొత్తిమీర వేసి స్టవ్ ఆపాలి.

Chicken Mentikoora / Fenugreek Leaves Curry,చికెన్ మెంతియాకు

 Chicken Mentikoora / Fenugreek Leaves Curry

కావలసిన పదార్ధాలు :
 
చికెన్ : అరకేజీ 
మెంతియాకు : 1 కట్ట 
(ఆకులుకోసి కడిగి, నీరు లేకుండా శుభ్రంగా చేసి పక్కనపెట్టాలి)
అల్లం వెల్లుల్లి ముద్ద : రెండు చెంచాలు
కారం : మూడు చేమ్చాలు 
ఉప్పు : సరిపడా 
గరం మసాల : 1 చెమ్చా
దనియల పొడి : 1 చెమ్చా 
కొత్తిమిర : 1 కట్ట 
తయారు చేయు విధానం :
 
1) చికెన్ కడిగి నీరువంచి పక్కన పెట్టాలి.
2) ఇప్పుడు కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద, ధనియాల పొడి, కొత్తిమిర అన్ని చికెన్లో కలిపి అరగంట పక్కన పెట్టాలి.
 3) ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె పోసి కాగనివ్వాలి.
4) నూనె కాగిన తరువాత అన్నీ కలిపిన చికెన్ వేసి వేగనివ్వాలి.
5) మధ్య మధ్యలో కలుపుతూ వుండాలి, అలా చికెన్ బాగా వేగి నీరంతా ఇగిరిపోయాక మెంతాకు వేసి కలపాలి.
6) రెండు నిముషాలకు పొడిపొడిగా అవుతుంది.
7) ఇప్పుడు గరం మసాలా జల్లి స్టౌ ఆపాలి.
 8) అంతే గుమ గుమలాడే మెంతాకు చికెన్ ఫ్రై రెడి.

Egg Biryani (ఎగ్ బిర్యాని)

Egg Biryani  (ఎగ్ బిర్యాని)

BY:www.thanuram.blogspot.com

Telugu Recipes : Egg Biryani in Telugu (ఎగ్ బిర్యాని)

కావలసిన పదార్దాలు :

కోడిగ్రుడ్లు: ఆరు కొత్తిమీర, పుదీనా తురుము: అరకప్పు
పచ్చిమిర్చి:ఆరు
పెరుగు: ఒక కప్పు
ఆయిల్: మూడు టేబుల్ స్పూన్లు
అల్లం, వెల్లుల్లి పేస్ట్: మూడు టేబుల్ స్పూన్లు.
కుంకుమపువ్వు: అర టేబుల్ స్పూన్.
కారం, ఉప్పు: సరిపడా
నిమ్మరసం: ఒక టేబుల్ స్పూన్.
బాస్మతి బియ్యం: నాలుగు కప్పులు,
ఆయిల్ : ఒక టేబుల్ స్పూన్,
బిర్యానీ ఆకులు : మూడు,
లవంగాలు :ఐదు
యాలకులు : ఐదు,
ఉప్పు :తగినంత .
టమాటాలు : రెండు
ఉల్లి ముక్కలు : కప్పు

తయారుచేయు విధానం :www.thanuram.blogspot.com

1) ముందుగా కోడిగ్రుడ్లను ఉడికించి కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. 2) అలాగే కుంకుమ పువ్వును గోరువెచ్చని పాలలో నానబెట్టుకోవాలి.
3) లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా, మిరియాలను పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
4) బాస్మతి బియ్యంలో సరిపడా నీటిని పోసి, అందులో ఏలకులు, లవంగాలు, బిర్యానీ ఆకులు, పుదినా ఉప్పు వేసి వండుకోవాలి.
5) తర్వాత ఉడికించిన అన్నాన్ని వెడల్పాటి ప్లేటు లోకి తీసుకుని చల్లార్చాలి.
6) కళాయిలో నెయ్యి వేసి వేడయ్యాక ఉల్లిపాయలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించాలి.
7) ఉల్లిపాయలు వేగాక, పచ్చిమిర్చి అల్లం, వెల్లుల్లి ముద్ద ఒకదాని తరువాత ఒకటి వేసి 2 నిమిషాలు వేపాలి.
తర్వాత కారం, బిర్యానీ మసాలా, ధనియాల పొడి, ఉప్పు వేసి కలియబెట్టాలి.
8) ఈ మిశ్రమంలో టమోటా, కోడిగ్రుడ్లు వేసి మసాలా కలిసేలా వేపుకోవాలి. ఇందులో పెరుగు, నిమ్మరసం వేసి పది నిమిషాల వేపి స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టాలి
9) ఒక పాన్ తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసి ఉడికించుకున్న అన్నాన్ని వేయాలి.
10 )దీని మీద కోడిగుడ్డు మసాలాకలిపి వేయించిన మిశ్రమం వేసిఅంతా సర్దాలి .
దీని ఫై నెయ్యి, పాలలో నానబెట్టిన కుంకుమపువ్వు చిలకరించి, కొత్తిమీర చల్లి మూత పెట్టి పదినిమిషాల పాటు ఉడికించి దింపేయాలి.
అంతే ఎగ్ బిర్యానీ రెడీ.

Prawns Fry, Royyala vepudu (రొయ్యల వేపుడు)

Prawns Fry in Telugu Royyala vepudu (రొయ్యల వేపుడు)


Telugu Recipes : Prawns Fry in Telugu Royyala vepudu (రొయ్యల వేపుడు)
 
కావలసిన పదర్దామలు :
 
రొయ్యలు : అరకిలో
నూనె వేయించటానికి సరిపడా 
నువ్వులు : అర కప్పు 
కొత్తిమీర (కట్ చేసినది) : అర కప్పు  
టమాట సాస్ : 2 టేబుల్ స్పూన్లు 
బియ్యపిండి : 2 టేబుల్ స్పూన్ 
కార్న్ ఫ్లొర్ : 1 టేబుల్ స్పూన్ 
అల్లం వెల్లుల్లి పేస్టు : 1 టీ స్పూన్ 
మిరియాలపొడి : పావు టీ స్పూన్ 
కారం : టీ స్పూన్ 
అజినమోటో : పావు టీ స్పూన్ 
ఉప్పు : సరిపడా 
తయారుచేయు విధానం :
 
1) రొయ్యలు శుభ్రం చేసి పసుపు, చిటికెడు ఉప్పు వేసి స్టవ్ మీద నీరంతా పోయేవరకు ఉడికించి ఉంచాలి.
2) ఇప్పుడు ఈ రొయ్యల్లో నూనె తప్పించి మిగిలిన పైన చెప్పినవన్నీ కలిపి పావుగంట పక్కన పెట్టాలి.
3) స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి. కాగిన తరువాత సిద్దం చేసిన రొయ్యల్ని వేసి దోరగా వేయించి ప్లేటులోకి తియ్యాలి. వీటిమీద కొత్తిమీర జల్లి సర్వ్ చేయాలి.
* ఎంతో రుచిగా ఉండే రొయ్యల వేపుడు రెడీ.

Egg Drumstick Curry , Gudlu Mulakkada Koora (గుడ్లు ములక్కాడలు కూర)

Egg Drumstick Curry , Gudlu Mulakkada Koora

(గుడ్లు ములక్కాడలు  కూర)

కావలసిన పదార్దాలు (Ingredients for Egg Drumstick Curry) :
 
గుడ్లు : ఆరు 
ములక్కాడలు : నాలుగు 
ఉల్లిపాయలు : మూడు  
పచ్చిమిర్చి : మూడు 
కారం : టీ స్పూన్
ఉప్పు : తగినంత 
అల్లం వెల్లుల్లి పేస్టు : టీ స్పూన్ 
గరం మసాలా : అర టీ స్పూన్ 
చింతపండు : నిమ్మకాయంత 
కరివేపాకు : రెండు రెమ్మలు 
పసుపు : పావు టీ స్పూన్ 
నూనె : మూడు టేబుల్ స్పూన్లు 
కొత్తిమీర : కొద్దిగా 
టమాటాలు : రెండు 
తయారుచేయు విధానం (Preparation Methos for Egg Drumstick Curry) :
 
1) గుడ్లు ఉడికించి వలిచి పక్కన పెట్టాలి. ములక్కాడలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు ముక్కలుగా కట్ చెయ్యాలి.
2) స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేడిచెయ్యాలి. నూనె కాగాక గుడ్లుకి అక్కడక్కడ గాట్లుపెట్టి వేయించి తియ్యాలి.
3) అదే నూనెలో ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేయించాలి. తరువాత అల్లం-వేల్లుల్లి పేస్టు వేసి వేగిన తరువాత టమాటముక్కలు వేసి మగ్గిన తరువాత ములక్కాడముక్కలు వేసి కలిపి, ఒక నిముషం మూతపెట్టాలి.
4) ఇప్పుడు మూతతీసి ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి కొద్దిగా నీళ్ళు పోసి మూతపెట్టి ఐదు నిముషాలు ఉడకనివ్వాలి. తరువాత చింతపండు రసం, గుడ్లు వేసి మరో ఐదు నిముషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు మసాలా, కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆపాలి.

Mutton Paya (మేక తలకాయమాంస రసం)

 Mutton Paya(మేక తలకాయమాంస రసం)
కావలసిన పదార్ధాలు :

మేకతలకాయ మాంసం : అరకేజీ
ఉల్లిపాయలు : మూడు
పచ్చిమిర్చి : మూడు
అల్లంవేల్లుల్లి పేస్టు : టేబుల్ స్పూన్
కారం : టేబుల్ స్పూన్
ఉప్పు : తగినంత 
పసుపు : అర టీ స్పూన్
గరం మసాల : 1 టీ స్పూన్
టమాటా : ఒకటి
కొత్తిమిర : చిన్న కట్ట
దనియాల పొడి : 1 టీ స్పూన్
గసాల పేస్ట్ : 1 టీ స్పూన్
www.srinainika.blogspot.com
తయారుచేయు విధానం :

1) తలకాయ మాంసం (మేక కాళ్ళుకూడా) కడిగి ఉప్పు, కారం, పసుపు, అల్లంవెల్లుల్లి, ధనియాల పొడి, కొద్దిగా కొత్తిమిర, గసాల పేస్ట్ వేసి బాగాకలిపి అరగంట పక్కన పెట్టాలి.
2) ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి నూనెవేసి వేడిచేయ్యాలి.
3) నూనె కాగాక ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగాక, అల్లంవెల్లుల్లి వేసి కాసేపు వేపాలి.
4) టమాటా ముక్కలు కూడా వేసి మగ్గనిచ్చి, అన్నీ కలిపినమాంసం వేసి ఒక నిముషం కలిపి, లీటరు నీళ్ళువేసి మూతపెట్టాలి.
5) అరగంట (విజిల్ పెట్టకూడదు) ఉడకనివ్వాలి.
6) ఇప్పుడు అర లీటరు రసం వరకు వచ్చాక, గరం మసాల, కొత్తిమిర వేసి మూత పెట్టి స్టవ్ ఆపాలి.

* అంతే మేకమాంస రసం రెడి.
* ఇది వేడిగా ఉన్నప్పుడే అన్నంలో వేసుకొని తింటే జలుబు తగ్గిపోతుంది.

Carrot Curry in Telugu (క్యారెట్ కూర)


Carrot Curry (క్యారెట్ కూర)


కావలసిన పదార్ధాలు :


క్యారెట్లు :మూడు
ఉల్లిపాయలు : రెండు
పచ్చిమిర్చి :రెండు
కారం :అర టీ స్పూన్
పసుపు : చిటికెడు
నూనె :రెండు టేబుల్ స్పూన్లు
కరివేపాకు :రెండు రెమ్మలు
ఉప్పు : సరిపడా
అల్లం ముక్కలు : టీ స్పూన్
పోపు దినుసులు : టీ స్పూన్
www.srinainika.blogspot.com
తయారుచేయు విధానం :


1) క్యారెట్లు చెక్కి ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచాలి.
2) స్టవ్ ఫై కళాయి పెట్టి నూనె వేసి కాగాక – పోపుదినుసులు, కరివేపాకు వేసి వేయించాలి. అవి వేగాక అల్లంముక్కలు, ఉల్లిముక్కలు, పచ్చిమిర్చిముక్కలు వేసి వేగాక, క్యారెట్ ముక్కలు వేసి కలిపి మూతపెట్టాలి. ఇలా చేస్తే క్యారెట్ ముక్కలు మెత్తబడతాయి.
3) చిన్నమంటమీద ఐదునిముషాలు ఉంచి మూతతీసి ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి రెండు నిముషాలు ఆగి స్టవ్ ఆపాలి.
BY:www.srinainika.blogspot.com

Aloo Gongura Curry in Telugu (గోంగూర, బంగాళాదుంప కూర)

Aloo Gongura Curry in Telugu (గోంగూర, బంగాళాదుంప కూర)
కావలసిన పదార్దములు :
బంగాళాదుంపలు : పావుకేజీ 
గోంగూర : ఒక కట్ట 
జీలకర్ర : అర టీ స్పూన్ 
మెంతులు : పావు టీ స్పూన్  
పసుపు : పావు టీ స్పూన్ 
కారం : అర టీ స్పూన్  
ఉప్పు : సరిపడా 
నూనె : రెండు టేబుల్ స్పూన్లు 
ఉల్లిపాయ – : ఒకటి 
పచ్చిమిర్చి : మూడు    

తయారుచేయు విధానం :

1) గోంగూరను శుబ్రంగా కడిగి చిన్నముక్కలుగా కట్ చేసి వుంచాలి.
2) బంగాళాదుంపలు కడిగి పొట్టుతీసిన ముక్కలు నీళ్ళలో వేసి పక్కన ఉంచాలి.
3) స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేడి చెయ్యాలి. నూనె కాగాక మెంతులు, జీలకర్ర వేసి వేగాక, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేగాక కారం, పసుపు, ఉప్పు వేసి ఒకసారి కలిపి బంగాళాదుంప ముక్కలు వేసి కొద్దిగా నీళ్ళు పోసి చిన్న మంటమీద పదినిముషాలు మూతపెట్టి  ఉడకనివ్వాలి.
4) పదినిముషాలు ఉంచి తరువాత మూతతీసి కట్ చేసిన గోంగూర వేసి కలిపి, రెండు నిముషాలు మూతపెట్టి మరో రెండు నిముషాలు ఆగి స్టవ్ ఆపాలి.

* అంతే పుల్లపుల్లని గోంగూర, బంగాళాదుంపల కూర రెడి.

Senagapappu Telagapindi Curry తెలగపిండి పచ్చిసెనగపప్పు కూర

Senagapappu Telagapindi Curry in Telugu

తెలగపిండి పచ్చిసెనగపప్పు కూర


కావలసిన పదార్ధాలు : 

పచ్చి సెనగ పప్పు : పావుకేజీ 
ఉల్లిపాయలు : రెండు
పచ్చిమిర్చి : నాలుగు
కారం : టీ స్పూన్
ఉప్పు : సరిపడా
కరివేపాకు : రెండు రెమ్మలు 
జీలకర్ర : అర టీ స్పూన్
ఆవాలు : అర టీ స్పూన్
వెల్లుల్లి : నాలుగు రెబ్బలు
నూనె : రెండు టేబుల్ స్పూన్లు
పసుపు : అర టీ స్పూన్
తెలగపిండి : వంద గ్రాములు

www.srinainika.blogspot.com
తయారుచేయు విధానం :

1) సెనగపప్పు కడిగి పావుగంట నానబెట్టాలి.
2) ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలుగా కోసి పక్కన ఉంచాలి.
3) ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయిపెట్టి నూనె వేడిచేసి ఆవాలు, జీలకర్ర, 
    వెల్లుల్లి, కరివేపాకు వేసి వేగాక, ఉల్లిముక్కలు, మిర్చి ముక్కలు వేసి 
    వేపాలి.
4) తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక, పసుపు, కారం వేసి కలిపి 
    సెనగపప్పు వేసి బాగా కలిపి, సరిపడా నీళ్ళుపోసి మూతపెట్టి 
    ఉడకనివ్వాలి.
5) పది నిముషాలు ఉడికిన తరువాత ఉప్పు, రాళ్ళు లేకుండా శుబ్రం 
    చేసిన తెలగపిండి వేసి సింలో అయిదు నిముషాలు ఉడకనివ్వాలి. 
6) ఇప్పుడు కూర పొడిపొడిగా అయ్యి తినటానికి రెడీగా వుంటుంది.
     (కావాలంటే నిమ్మకాయ పిండు కోవచ్చు)

* అంతే తెలగపిండి, సెనగపప్పు కూర రెడి.