header

Friday 21 October 2016

PAPPU DOSAKAYA


పప్పు దోసకాయ

Ingredients for Pappu Dosakaya (కావలసిన పదార్దాలు) :

 
కందిపప్పు : కప్పు 
దోసకాయ  : ఒకటి 
టమాటాలు : రెండు 
పచ్చిమిర్చి : నాలుగు 
ఉల్లి పాయ : ఒకటి 
పసుపు : పావు టీస్పూన్ 
కారం : అర టీ స్పూన్ 
ఉప్పు : సరిపడా 
వెల్లుల్లి రేకలు : పది 
జీలకర్ర : పావు టీ స్పూన్ 
పోపుదినుసులు : టీ స్పూన్ 
ఎండు మిర్చి : రెండు 
కరివేపాకు : రెండు రెమ్మలు  
కొత్తిమీర : కొద్దిగా 
నెయ్యి : టేబుల్ స్పూన్ 
చింత పండు : నిమ్మకాయంత 
 

Prepapration Method for Pappu Dosakaya (తయారుచేయు విధానం) :

 
1) దోసకాయ కడిగి  చెక్కి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.టమాటా,పచ్చిమిర్చి,ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2) కంది పప్పు బాగా కడిగి కుక్కర్లో వేసి రెండు కప్పుల నీళ్ళు పోసి అరగంట నానబెట్టాలి.
3) స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాలి. మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపాలి.
4) కుక్కర్ ఆవిరి పోయాక మూత తీసి పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు ఉల్లి ముక్కలు ,దోసకాయ ముక్కలు ,పసుపు,కారం వేసి వుడకనివ్వాలి. పది నిముషాలు వుడికిన తరువాత ఉప్పు,చింతపండు రసం వేసి ఐదు నిముషాలు వుడకనిచ్చి, కుక్కర్ దించుకోవాలి.
5)ఇప్పుడు  స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేడి చేయ్యాలి.
6)  పోపుదినుసులు, ఎండిమిర్చి, కరివేపాకు,జీలకర్ర, వెల్లుల్లి వేసి వేగిన తరువాత ఈ తాలింపు పప్పులో వేసి కలపాలి. కొత్తిమీర కూడా వేసి మూత పెట్టి స్టవ్ ఆపాలి.  

                                                BY:www.srinainika.blogspot.com
 

No comments:

Post a Comment