మీల్ మేకర్ మసాలా కూర
కావలసిన పదార్థాలు:
మీల్ మేకర్ ఒక కప్పు, తరిగిన ఉల్లిపాయలు, టమోటాలు- రెండేసి చొప్పున(మెత్తగా రుబ్బుకోవాలి), అల్లంవెల్లుల్లి ముద్ద- రెండు టీ స్పూన్లు, కారం- రెండు టీ స్పూన్లు, దనియాల పొడి- ఒక టీ స్పూను, పసుపు- చిటికెడు, సన్నగా తరిగిన మెంతెం కూర- ఒక టేబుల్ స్పూను, గరం మసాలా- అర టీ స్పూను, పెరుగు- రెండు టీ స్పూన్లు, వెన్న- ఒక టేబుల్ స్పూను, నూనె- ఒక టేబుల్ స్పూను, ఉప్పు- తగినంత, కొత్తిమీర- ఒక టేబుల్ స్పూను, లవంగాలు- మూడు, దాల్చిన చెక్క- చిన్న ముక్క, సోంపు- అర టీ స్పూను, యాలకులు- ఒకటి.
తయారీ విధానం:
వేడినీటిలో మీల్ మేకర్‌ని వేసి పది నిమిషాలు నానబెట్టాలి. తర్వాత నీటిని మొత్తం చేతులతో పిండేసి రెండు నిమిషాలు ఆరనివ్వాలి. ఒక బాణలిలో నూనె పోసి వేడెక్కాక మసాలా దినుసులు వేసి వేగించాలి. తర్వాతఉల్లిపాయ ముద్దను, అల్లంవెల్లుల్లి ముద్దను వేసి మరో 5 నిమిషాలు వేగించాలి. ఆ తర్వాత కారం, పసుపు, దనియాల పొడి, ఉప్పు, మెంతెం కూర వేసి బాగా కలపాలి. రెండు నిమిషాలు వేగించిన తర్వాత పెరుగు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం చిక్కబడిన తర్వాత మీల్ మేకర్, వెన్న, గరం మసాలా వేసి చిన్న మంట మీద 5 నిమిషాలు ఉడకనివ్వాలి.