కావలసిన పదార్ధాలు :
తోటకూర : రెండు కట్టలు
పోపు దినుసులు : రెండు స్పూన్లు
ఎండుమిర్చి : నాలుగు
వెల్లులి రెబ్బలు : పది (పొట్టు తీసుకోవాలి)
నూనె : 100 గ్రాములు
కరివేపాకు : రెండు రెమ్మలు
పసుపు : కొంచెం
కారం : 1 స్పూను
ఉప్పు : తగినంత
తయారు చేయు విధానం :
1) తోటకూర చిన్నచిన ముక్కలుగా కోసి నీటిలో కడగాలి, నీటిని పిండి పక్కన పెట్టాలి.
2)ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేడి చెయ్యాలి.
3) ఇప్పుడు పోపు దినుసులు వేసి వేగాక, ఎండుమిర్చి వేసి వేగాక, వెల్లుల్లి వేసి వేగాక, శుభ్రం చేసుకున్న తోటకూర వేసి కలిపి మూతపెట్టాలి.
4) రెండు నిముషాలు తర్వాత మూత తీసి కారం, పసుపు, ఉప్పు వేసి గరిటతో కలిపి తోటకూర పొడిపొడిగా వేగిన తరువాత కరివేపాకు వేసి స్టవ్ ఆపాలి.
అంతే తోటకూర వేపుడు రెడి.