చికెన్ : అరకేజీ
మెంతియాకు : 1 కట్ట
(ఆకులుకోసి కడిగి, నీరు లేకుండా శుభ్రంగా చేసి పక్కనపెట్టాలి)
అల్లం వెల్లుల్లి ముద్ద : రెండు చెంచాలు
కారం : మూడు చేమ్చాలు
ఉప్పు : సరిపడా
గరం మసాల : 1 చెమ్చా
దనియల పొడి : 1 చెమ్చా
కొత్తిమిర : 1 కట్ట
తయారు చేయు విధానం :
1) చికెన్ కడిగి నీరువంచి పక్కన పెట్టాలి.
2) ఇప్పుడు కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద, ధనియాల పొడి, కొత్తిమిర అన్ని చికెన్లో కలిపి అరగంట పక్కన పెట్టాలి.
3) ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె పోసి కాగనివ్వాలి.
4) నూనె కాగిన తరువాత అన్నీ కలిపిన చికెన్ వేసి వేగనివ్వాలి.
5) మధ్య మధ్యలో కలుపుతూ వుండాలి, అలా చికెన్ బాగా వేగి నీరంతా ఇగిరిపోయాక మెంతాకు వేసి కలపాలి.
6) రెండు నిముషాలకు పొడిపొడిగా అవుతుంది.
7) ఇప్పుడు గరం మసాలా జల్లి స్టౌ ఆపాలి.
8) అంతే గుమ గుమలాడే మెంతాకు చికెన్ ఫ్రై రెడి.
No comments:
Post a Comment