చి కె న్ లె గ్ పిస్ ఫ్రై
కావలసిన పదార్ధాలు :
చికెన్ లెగ్స్ : రెండు లేదా మూడు
అల్లం-వెల్లుల్లి పేస్టు : టి. స్పూన్లు
ఉప్పు : తగినంత
కారం : అర టేబుల్ స్పూన్
నూనె : పావుకిలో
గరం మసాల : అర టి స్పూన్
దనియాల పొడి : 1 టి స్పూన్
పసుపు : పావు టి స్పూన్
పచ్చిమిర్చి :మూడు
కొత్తిమీర : కొద్దిగా
తయారుచేయు విధానం :
1) ముందుగా అల్లంవెల్లుల్లి, కారం, ఉప్పు, పసుపు, గరం మసాల, ధనియాల పొడి, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ కలిపి ముద్దలా చేసి (మిశ్రమంలా) పక్కనపెట్టాలి.
2) ఇప్పుడు చికెన్ లెగ్స్ కి చాకుతో ఘాట్లు పెట్టి, సిద్డం చేసుకున్న మిశ్రమాన్ని పట్టించి గంట పక్కనపెట్టాలి.
3) ఇప్పుడు స్టవ్ పై కళాయిపెట్టి నూనె వేడిచేయ్యాలి. మసాలతో వున్న చికెన్ లెగ్స్ని కాగిననూనెలో వేసి బాగా వేపి తియ్యాలి.
4) వీటిని నిమ్మకాయ ముక్కలుతో ఉల్లి ముక్కలతో అలంకరించాలి.
అంతే చికెన్ లెగ్స్ వేపుడు రెడి.
No comments:
Post a Comment