వంకాయవేపుడు
కావలసిన పదార్ధాలు :
వంకాయలు : పావుకేజీ (లేతవి )
అల్లం, పచ్చిమిర్చి పేస్టు : ఒక టీ స్పూన్
పసుపు : అర టీ స్పూన్
పోపు దినుసులు : టేబుల్ స్పూన్
వెల్లులి : నాలుగు రెబ్బలు
ఎండుమిర్చి : రెండు
కరివేపాకు : కొద్దిగా
నూనె : మూడు టేబుల్ స్పూన్లు
ఉప్పు : తగినంత
తయారుచేయు విధానం :
1) వంకాయలను నిలువుగా ముక్కలు కోసి నీళ్ళలో వేసి ఉంచాలి.
2) స్టవ్ వెలిగించి కళాయిలో నూనె వేడి చెయ్యాలి. నూనె కాగాక
పోపుదినుసులు వేసి వేపాలి. అవి వేగాక కరివేపాకు, ఎండిమిర్చి, వెల్లుల్లి
వేసి ఒకసారి కలిపి పచ్చిమిర్చి-అల్లం పేస్టూ, పసుపు వేసి కలిపి
వంకాయలు వేసి కలపాలి.
3) చిన్న మంటమీద వేగనివ్వాలి. వంకాయ ముక్కలు మెత్తబడ్డాక ఉప్పు
వేసి కలపాలి. ఒకనిముషం వేగాక స్టవ్ ఆపాలి.
* అంతే వంకాయ వేపుడు రెడి.
No comments:
Post a Comment