header

Sunday, 20 November 2016

CARROT SOUP

CARROT SOUP


కావలసిన పదార్థాలు:
 తరిగిన క్యారెట్‌ - 1 కప్పు, పొట్టు పెసరపప్పు - అరకప్పు, మిరియాలు - 6, ఉల్లి తరుగు - పావు కప్పు, వెల్లుల్లి తరుగు - 1 టీ స్పూను, టమోటా తరుగు - పావు కప్పు, పాలు - ముప్పావు కప్పు, నూనె - 1 టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత.
తయారుచేసే విధానం:
 నూనెలో మిరియాలు, ఉల్లి, వెల్లుల్లి తరుగులను 3 నిమిషాలు వేగించాలి. తర్వాత క్యారెట్‌, టమోటా ముక్కలు కలపాలి. 4 నిమిషాల తర్వాత పెసరపప్పుతో పాటు ఒక కప్పు నీరు పోసి క్యారెట్‌ ముక్కలు మెత్తబడేవరకు చిన్నమంటపై ఉడికించాలి. మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీలో పేస్టు చేసుకోవాలి. ఈ పేస్టుకి పాలతో పాటు ఒకటిన్నర కప్పు నీరు, ఉప్పు, మిరియాలపొడి కలిపి మరికొద్దిసేపు మరిగించాలి. వేడి వేడిగా ఉన్నప్పుడే బ్రెడ్‌ క్యూబ్స్‌ వేసుకుని తాగాలి.

చాక్లెట్‌

చాక్లెట్‌


కావలసిన పదార్థాలు:
 డార్క్‌ చాక్లెట్‌ తురుము, పంచదార, కండెన్సడ్‌ మిల్క్‌- ఒక్కోటి అరకప్పు చొప్పున, పచ్చికోవా- 3/4 కప్పు, పాలు- 1 లీటరు.
తయారీ విధానం: 
పాలు మూడింట ఒక వంతు అయ్యేవరకూ మరిగించాక కోవా, కండెన్సడ్‌ మిల్క్‌లను కూడా వేసి మరో ఐదునిమిషాలు కలుపుతూ ఉడికించాలి. తరువాత పంచదార, చాక్లెట్‌ తురుము కూడా వేసి కలిపి మరో రెండు నిమిషాలు ఉడికించాక దించేయాలి. ఈ మిశ్రమం చల్లారాక కుల్ఫీ మౌల్డ్‌లలో పోసి ఐదారుగంటలపాటు డీప్‌ ఫ్రీజర్‌లో ఉంచాలి.

Dates ladoo in Telugu Karjuram Senagapappu Laddu (ఖర్జురాలు, వేరుసెనగపప్పు లడ్డు


Dates ladoo in Telugu Karjuram Senagapappu Laddu (ఖర్జురాలు, వేరుసెనగపప్పు లడ్డు)


కావలసిన పదార్ధాలు : 

ఖర్జూరం : పావుకేజీ
వేరుసెనగ పప్పులు : పావుకేజీ

తయారుచేయు విధానం :

1) వేరుసెనగ పప్పులు దోరగా వేపి పొట్టు తియ్యాలి, ఖర్జూరాలు గింజలు తియ్యాలి.
2) ఇప్పుడు వేరుసెనగ పప్పులు మిక్సిలో వేసి ఒకసారి తిరిగాక, ఖర్జూరాలు వేసి ఒకసారి మిక్స్ చేశాక ఆపాలి.
3) ఇప్పుడు మిక్సి జార్ లో నుండి తీసి ఉండలు చుట్టుకోవాలి.

* అంతే ఖర్జురపు ఉండలు రెడి.
* ఇవి పిల్లలకు చాలా బలవర్దక మైనవి.

Brown Rice Pulao

Brown Rice Pulao



Ingredients:
2 cups Basmati brown rice, soak for an hour in warm water
1 large onion, finely sliced
2 cups cubed mixed vegetables (carrots, potatoes, beans, peas)
2 tbsp oil + 1 tbsp ghee
1 tsp ginger garlic paste
few curry leaves
garam masala pwd (3 cloves, 1″ cinnamom, 1 elachi, 1 star anise)
salt to taste
Coarsely crush (do not make a paste):
4-5 tbsps chopped coriander leaves
8-10 chopped pudina leaves
2-3 green chillis
1 Heat oil+ghee in a cooking vessel, add the sliced onions and curry leaves and saute for 5 mts. Add the ginger garlic paste and crushed coriander-pudina-green chillis and saute further for another 5 mts. Add the cubed mixed vegetables and saute for 6-7 mts.
2 Add 4 1/2 cups water and bring to a boil. Add the brown rice, salt and garam masala pwd, reduce heat, cover with lid and cook till the rice is done.
3 Serve hot with raita or any curry of your choice.

BANANAA KULFI

BANANAA KULFI


కావలసినవి:
 పాలు ఒక లీటరు, పంచదార ఐదారు టేబుల్‌ స్పూను
అరటి పండ్ల గుజ్జు మూడు టేబుల్‌ స్పూన్లు కొన్ని అరటి పండు ముక్కలు లేదా చెర్రీలు.
ఎలా చేయాలి:
అరటి పండును ఒలిచి ఫోర్క్‌తో మెత్తటి గుజ్జులా చేయండి. ఒక టీస్పూన్‌ చక్కెర నీళ్ళతో ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోండి. పాలు అడుగంటకుండా తిపతూ నాలుగోవంతు చిక్కదనం వచ్చేదాకా ఉంచండి. ఆ తర్వాత చక్కెర కలిపి, పూర్తిగా కరిగాక కిందికి దింపి చల్లార్చండి. అపడు అరటిగుజ్జు కలిపి కప్పుల్లో గాని, బౌల్స్‌లోగాని పోసి ఫ్రీజర్‌లో పెట్టండి. పైన చెర్రీలుగాని, అరటి ముక్కలుగాని వేసుకుని తినండి.

పుణుకుల పులుసు

పుణుకుల పులుసు


కావలసిన పదార్థాలు:
 పెరుగు - 2 కప్పులు, పసుపు - పావు టీ స్పూను, శనగపిండి - 2 టేబుల్‌ స్పూన్లు, ఉల్లిపాయ - 1, పచ్చిమిర్చి - 2, కరివేపాకు - 4 రెబ్బలు, కొత్తిమీర - 1 కట్ట, ధనియాలపొడి - 1 టీ స్పూను, నెయ్యి - అర టేబుల్‌ స్పూను, ఎండుమిర్చి - 4, ఆవాలు, జీలకర్ర, మినపప్పు - (అన్నీ కలిపి) 1 టీ స్పూను, ఇంగువ - చిటికెడు.
పుణుకుల తయారీకి: శనగపిండి - 2 కప్పులు, వంటసోడ - చిటికెడు, ఉప్పు - తగినంత, మసాలపొడి, ధనియాలపొడి - 1 టీ స్పూను చొప్పున., నూనె - వేగించడానికి సరిపడా.
తయారుచేసే విధానం:
 ఒక పాత్రలో శనగపిండి, కారం, ధనియాలపొడి, మసాలపొడి, ఉప్పు, చిటికెడు వంటసోడా వేసి తగినంత నీరు జతచేస్తూ జారుగా (పుణుకుల కోసం) కలిపి పక్కనుంచుకోవాలి. మరోపాత్రలో పెరుగు, రెండుకప్పుల నీరు, పసుపు, తరిగిన మిర్చి, ఉల్లి, శనగపిండి, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు చేర్చి కవ్వంతో అన్నీ కలిసేలా (పెరుగు ముక్కలు కన్పించకుండా) చిలకాలి.
కడాయిలో నెయ్యి వేసి ముందుగా ఇంగువ వేసి తర్వాత ఎండుమిర్చి, పోపు దినుసులు వేసి, తాలింపు వేగాక మజ్జిగ మిశ్రమాన్ని కలిపి 5 నిమిషాలపాటు సన్నని సెగమీద మరనివ్వాలి. ఇప్పుడు మరో కడాయిలో నూనెవేసి పుణుకులు తయారుచుసుకుని తినడానికి 5 నిమిషాల ముందు మజ్జిగ పులుసులో వేసి నానబెట్టాలి. పుణుకుల పులుసు అన్నంతో చాలా రుచిగా ఉంటుంది.

ఉలవచారు

ఉలవచారు


కావలసిన పదార్థాలు: 
ఉలవలు - 1 కప్పు, చింతపండు - నిమ్మకాయంత, పచ్చిమిర్చి - 3, ఎండుమిర్చి - 2, కరివేపాకు - 4 రెబ్బలు, జీలకర్ర - అర టీ స్పూను, ఆవాలు - 1 టీ స్పూను, బెల్లం తరుగు - 1 టీ స్పూను. 
పొడి కోసం : దనియాలు - 1 టేబుల్‌ స్పూను, జీలకర్ర - 1 టీ స్పూను, వెలుల్లి రేకలు - 6.
తయారుచేసే విధానం:
 ఉలవల్ని ఒక రాత్రంతా నానబెట్టి 8 కప్పుల నీటిలో మెత్తగా ఉడికించి వడకట్టాలి. తర్వాత అరకప్పు ఉలవలను మాత్రమే తీసుకుని పేస్టులా రుబ్బుకోవాలి. కడాయిలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, వేగించి వడకట్టిన నీరు పోసి మరిగించాలి. ఒక పొంగు రాగానే పసుపు, ఉప్పు, బెల్లం, రసం పొడి, ఉలవల పేస్టు, చింతపండు గుజ్జు కలిపి చిన్నమంటపై 20 నిమిషాలు మరిగించాలి. వేడి వేడి అన్నంతో తింటే ఎంతో రుచిగా ఉండే ఉలవచారు ఇది.

Kalakand

Kalakand 


కావలసిన పదార్ధాలు :

పాలు : 1 లీటరు
పంచదార : అరకేజీ
నెయ్యి : పావు కప్పు (50 Grms)

తయారు చేయు విధానం :

1. పాలు కాచి, దానిలో నిమ్మరసం పిండితే పాలు విరుగుతాయి.
2. ఇప్పుడు స్టవ్ వెలిగించి పంచదార లేతపాకం వచ్చాక దానిలో విరిగిన పాలను వేసి బాగా కలపాలి.
3. పాకం కాస్త గట్టిపడ్డాక నెయ్యి వేసి కలిపి, ప్లేటుకి నెయ్యి రాసి పాకాన్ని ప్లేటులోకి వంచి సమంగా చేసి, ఆరిన తరువాత ముక్కలుగా కోసుకోవాలి.
4. ప్లేటులోకి వేసినప్పుడు కాస్త వేడిగా ఉన్నప్పుడే సిల్వర్ ఫాయిల్  అద్దితే బాగుంటుంది. అంతే కలాకంద రెడి.

Jigarthanda drink

Jigarthanda drink recipe

  • Prep time: 
  • Cook time: 
  • Serves: 3

Main Ingredients:

  1. milk
  2. badam pisin

Ingredients

  • Badam pisin - 1 tsp or 4-5 small pieces (almond gum)
  • Milk - 4 1/2 cups, full fat milk
  • Nannari sharbat - 3 tbsps (sarsaparilla root syrup)
  • Ice cream - 3 scoops (made from reduced milk) OR store bought vanilla ice cream
  • Sugar - 3 tbsps (adjust)

Method

  1. Soak badam pisin in 1 1/4 cups of water overnight. Next day, it will swell and form a transparent jelly like consistency. Remove any impurities if any.
  2. Bring full fat milk to a boil and reduce to almost half its original quantity. You will have 2 1/4 cups of reduced milk. Turn off flame, add 3 tbsps of sugar and mix till dissolved. Bring to room temperature and chill in fridge till use.
  3. To assemble the drink, take three tall glasses. Add a generous tbsp of the badam pisin in each glass followed by a drizzle a generous tbsp of nannari syrup. Divide the sweetened milk among the three glasses till three fourth full.
  4. Top with a scoop of reduced milk ice cream or store bought vanilla ice cream and serve immediately.

Tips

  • Make reduced milk the earlier day and chill in the fridge overnight.
  • Make ice cream the earlier day and freeze.
  • You can replace nannari syrup with rose syrup/rooh afza.
  • You can use agar agar (china grass) instead of badam pisin, if you do not have access to almond gum/badam gond. If using agar agar, soak a fistful in 1/3 cup of warm sugar syrup till they form into a jelly and use in place of badam pisin.
  • Badam pisin is available in native ayurvedic medicine stores.
  • I have used homemade ice cream. You can use store bought vanilla ice cream.
  • In case the drink does not have a light brown shade, you can also achieve it by adding caramalized sugar to the reduced milk.

Coconut Samosa Kobbari Samosa (కొబ్బరి సమోసా)

Coconut Samosa \Kobbari Samosa (కొబ్బరి సమోసా)


కావలసిన పదార్దములు :

జీడిపప్పులు, బాదం పప్పులు, పిస్తా పప్పులు (చిన్నగా కట్ చేసినవి) : 1 కప్పు
కొబ్బరి కాయ : ఒకటి
పంచదార : మూడు  కప్పులు
మిల్క్ మెయిడ్ : 1 కప్పు
యాలుకలపొడి : టీ స్పూన్
మైదా : పావు కిలో
నెయ్యి : కప్పు
నూనె : పావుకిలో


తయారు చేయు విధానం :


1) మైదాలో కొద్దిగా పంచదార పొడి, చిటికెడు ఉప్పు, టీ స్పూన్ నెయ్యి వేసి ముద్దలా కలిపి పక్కన పెట్టాలి.
2) ఇప్పుడు కొబ్బరి కోరుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి ఒక గిన్నెపెట్టి దానిలో పంచదార, కొద్దిగా మిల్క్ మైడ్ వేసి తీగపాకం పట్టాలి.
3) పాకంలో కొబ్బరికోరు వేసి గట్టిపడే వరకు కలుపుతూ ఉండాలి. గట్టి పడిన దానిలో యాలుకలపొడి వేసి కలిపి పక్కనపెట్టాలి. దీనిలో చిన్నగా కట్ చేసిన జీడిపప్పులు, బాదాం, పిస్తా పప్పులు వేసి కలిపి పక్కన పెట్టాలి. 
4) ఇప్పుడు మైదాని చిన్నచిన్న ఉండలుగా చేసి చెపాతిచెయ్యాలి. దీనిని మధ్యకు కట్ చేసి ఒక ముక్కను సమోసాలా చుట్టి  దానిలో కొబ్బరి మిశ్రమం పెట్టి మూసి వెయ్యాలి.
5) అలాగే మొత్తం సమోసాలు చేసి పక్కన పెట్టాలి.
6) ఇప్పుడు స్టవ్ మీద నూనె వేడిచేసి తయారు చేసిన సమోసాలు వేసి దోరగా వేయించి తియ్యాలి.
7) ఇప్పుడు పంచదార తీగపాకం పట్టి వేయించిన సమోసాలు పాకంలో వేసి ఐదునిముషాలు వుంచి, తీసి ప్లేటులో పెట్టాలి.

Cabbage Chutney (కేబేజీ పచ్చడి)

Cabbage Chutney (కేబేజీ పచ్చడి)
Ingredients for Cabbage Chutney (కావలసిన పదార్దములు) :

పచ్చిమిర్చి : పది
టమాటాలు : రెండు
కొత్తిమిర : కొద్దిగా
కేబేజీ తరుగు : కప్పు
ఉప్పు : తగినంత
చింతపండు : కొద్దిగా
నూనె : సరిపడా
తాలింపు కోసం : (మినపప్పు, సెనగపప్పు, వెల్లుల్లి, ఎండిమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు)
Preparation Method for Cabbage Chutney (తయారుచేయు విధానము) :

1) స్టవ్ వెలిగించి నూనె వేడి చేసి పచ్చిమిర్చి వేపాలి.
2) అదే నూనేలో టమాట ముక్కలు వేసి కాసేపు మగ్గనిచ్చి దానిలో కొత్తిమిర, కేబేజీ వేపి దించి, చల్లారనివ్వాలి.
3) ఇప్పుడు మిక్సి జార్లో వేసి ఉప్పు, చింతపండు కూడా వేసి మెత్తగా మిక్సి పట్టాలి.
4) పచ్చడి రెడి అయ్యినట్టే, ఇప్పుడు నూనె వేడి చేసి పోపుదినుసులు వేసి వేగాక, పచ్చడిని తాలింపులో వేసి కలపటమే.
* అంతే కేబేజీ పచ్చడి రెడి.

చేపల పులుసు

చేపల పులుసు


కావల్సినవి:
 చేపముక్కలు (శుభ్రం చేసినవి) - 1 కెజి (మీడియం సైజువి), నూనె - 50 గ్రాములు, సాజీర - 10 గ్రాములు, ఆవాలు - 10 గ్రాములు, చింతపండు (పాతది) - 50 గ్రాములు, టమాట - 100 గ్రాములు, కారం - 5 గ్రాములు, పసుపు - టీ స్పూన్‌, ఉల్లిపాయలు - 150 గ్రాములు, జీలకర్ర మెంతుల పొడి - రెండు టీస్పూన్లు, ధనియాలపొడి- రెండు టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - నాలుగు టీస్పూన్లు , కరివేపాకు - ఒకరెబ్బ, పచ్చిమిర్చి - 5 (నిలువుగా కోసినవి), ఉప్పు - రుచికి తగినంత, కొత్తిమీర - తగినంత, చక్కెర - 3 టీస్పూన్లు
తయారీ విధానం:కొద్దిగా నీరుపోసి చింతపండును నానబెట్టాలి. వెడల్పాటి గిన్నె లేదా బాండీలో నూనెపోసి వేడి చేశాక పచ్చిమిర్చి, సాజీర, ఆవాలు, ముక్కలు తరిగిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లిపేస్ట్‌, టమాటాముక్కలు, కారం, ధనియాలపొడి, జీలకర్ర, మెంతులపొడి, పసుపు, కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ కలపాలి. నానబెట్టిన చింతపండును గుజ్జుగా తీసి పై మిశ్రమంలో కలపాలి. ఉప్పు, చక్కెర వేసి చిక్కని గ్రేవీలా తయారయ్యాక చేపముక్కలను ఆ గ్రేవీలో ఒక్కోటి వేసి పైన మూత పెట్టాలి. అయిదు నిమిషాల తర్వాత ముక్కలను రెండోవైపుకు మార్చి మరికొద్దిసేపు ఉడకనివ్వాలి. ముక్కలను ఎక్కువగా కలపవద్దు. చివర్లో కొత్తిమీర ఆకులను చల్లి దించేస్తే ఘుమఘుమలాడే చేపల పులుసు రెడీ. (చేపల పులుసు చేసిన రోజుకంటే మరుసటి రోజు మరింత రుచిగా వుంటుంది.)

ఆలు రైతా

 ఆలు రైతా


కావలసిన పదార్థాలు:
 ఆలు - 2, పెరుగు - 2 కప్పులు, పచ్చిమిర్చి - 2, వెల్లుల్లి - 2 రేకలు, జీరాపొడి - అర టీ స్పూను, పుదీనా ఆకులు - 1 టేబుల్‌ స్పూను, ఉప్పు - రుచికి తగినంత.
తయారుచేసే విధానం:
 ముందుగా ఆలుగడ్డల్ని మెత్తగా ఉడికించి తొక్కతీసి మెదిపి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, పుదీనా, వెల్లుల్లి గ్రైండు చేసుకోవాలి. తర్వాత పెరుగులో మెదిపిన ఆలు గుజ్జు, పుదీనా మిశ్రమం, జీరాపొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ రైతా పరాటాల్లోకి, అన్నంలోకి బాగుంటుంది.

చిలగడదుంప పూరీలు

చిలగడదుంప పూరీలు
www.srinainika.blogspot.com


కావలసిన పదార్ధాలు:
 చిలగడదుంపలు - పావుకిలో ( ఉడికించి తొక్కతీసి బాగా మెదపాలి), బెల్లం తురుము - పావుకప్పు, గోధుమపిండి - కప్పు, ఉప్పు - తగినంత, యాలకుల పొడి - టీ స్పూను, నీరు - పిండి కలపడానికి తగినంత
తయారీ పద్ధతి: 
 ఒక గిన్నెలో కొద్దిగా నీరు, బెల్లంతురుము వేసి గరిటెతో కలిపి కరిగించి వడకట్టాలి. అదే పాత్రలో మెత్తగా చేసిన చిలగడదుంప ముద్ద, యాలకుల పొడి, గోధుమపిండి వేసి బాగా కలపాలి. తగినంత నీరు జతచేసి పూరీ పిండి మాదిరిగా కలిపి అరగంట పాటు పక్కన ఉంచాలి. పిండిని చిన్న ఉండలుగా చేసి పూరీలు ఒత్తుకోవాలి. బాణలిలో తగినంత నూనె పోసి కాగాక, ఒక్కో పూరీ వేసి వేయించి తీయాలి. తియ్యతియ్యని చిలగడదుంప పూరీలు రెడీ.

కొత్తిమీర చపాతీలు

 కొత్తిమీర చపాతీలు


కావలసిన పదార్థాలు:
 గోధుమ పిండి - నాలుగు కప్పులు, వెన్న - ఒక టేబుల్‌ స్పూను, కొత్తిమీర తురుము - ఒక కట్ట, పచ్చిమిరపకాయలు - రెండు, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా. 
తయారుచేయు విధానం:
 కొత్తిమీరని సన్నగా తరగాలి. ఇందులో గోధుమపిండి, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, వెన్న, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసుకుని చపాతి పిండిలా కలుపుకోవాలి. ఒక గంట తర్వాత చపాతీలు చేసుకుని వేడివేడిగా తింటే ఎంతో రుచిగా ఉంటాయి.

మటన్‌ kurma

మటన్‌ kurma


కావలసిన పదార్థాలు:
 నూనె- అరకప్పు, ఉల్లిపాయ (తరిగి)- ఒకటి, మటన్‌- ముప్పావు కేజీ, పెరుగు- నాలుగు టీస్పూన్లు, నీళ్లు- ఒక కప్పు, ధనియాల పొడి- రెండు టీస్పూన్లు, కారం- ఒక టీస్పూను, ఉప్పు- తగినంత, అల్లం వెల్లుల్లి పేస్టు- రెండు టీస్పూన్లు, లవంగాలు- నాలుగు, యాలకలు- రెండు, దాల్చినచెక్క- మూడు అంగుళాలు, వేగించిన ఉల్లిపాయ ముక్కలు- రెండు టీస్పూన్లు. 
తయారీ విధానం: 
ఒక గిన్నెలో నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అవి వేగిన తరువాత మటన్‌, పెరుగు, ఉప్పు, నీళ్లు, ధనియాల పొడి, కారం వేసి బాగా కలపాలి. కొద్దిసేపటి తరువాత అల్లంవెల్లుల్లి పేస్టు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకలు వేసి సన్నటి మంటపై అరగంట ఉడికించాలి. తరువాత వేగించుకున్న ఉల్లిపాయలు వేసి మటన్‌ ముక్కలు మెత్తబడే వరకు ఉడికించాలి. దీన్ని చపాతీ, రోటీలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది.

సొర చేప పొడి

సొర చేప పొడి



కావలసిన పదార్థాలు:
 సొర చేపలు - 2, ఉల్లి ముక్కలు - 1 కప్పు, పచ్చిమిర్చి - 4, ఆవాలు, మినప్పప్పు - చెరొక స్పూను, జీలకర్ర - 1 టీస్పూను. అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 2 టీస్పూన్లు, గరం మసాలా - 1 టీస్పూను, పసుపు - 1 టీస్పూను, ఉప్పు - తగినంత, కొత్తిమీర - 1 కట్ట, నూనె - 2 టే.స్పూన్లు
తయారీ విధానం: 
గిన్నెలో చేప ముక్కలు, ఉప్పు, పసుపు, చేపలు మునిగేటన్ని నీళ్లు పోసి 10 నిమిషాలు ఉడికించాలి. ఉడికిన తర్వాత ముక్కల్ని చిదిమి పక్కనుంచాలి. కడాయిలో నూనె పోసి మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తర్వాత ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తర్వాత అల్లంవెల్లుల్లి పేస్ట్‌ వేసి పచ్చివాసన పోయేవరకూ వేయించాలి. పసుపు, గరం మసాలా, ఉప్పు వేసి కలపాలి. తర్వాత కొత్తిమీర తరుగు వేసి కలిపి చేప పొడి వేయాలి. బాగా కలిపి చిన్న మంట మీద 5 నిమిషాలు మగ్గనివ్వాలి.

గ్రీన్ మసాలా ఫిష్‌ ఫ్రై

గ్రీన్ మసాలా ఫిష్‌ ఫ్రై


కావలసిన పదార్థాలు:
 పచ్చి చేప ముక్కలు, గ్రీన్ మసాలా పేస్ట్‌ కోసం: పుదీనా - అర కట్ట, కొత్తిమీర - అరకట్ట, కరివేపాకు - 2 రెమ్మలు, పచ్చిమిర్చి -3, మసాలా కోసం: పసుపు - అర టీ స్పూను, గరం మసాలా - 1 టీ స్పూన్, ధనియాలపొడి - 1 టీ స్పూన్, జీలకర్ర పొడి - అర టీ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 1 టీ స్పూన్, కారం - 1 టీ స్పూన్, మిరియాల పొడి - అర టీ స్పూన్, ఉప్పు - రుచికి సరిపడా, నిమ్మకాయ - 1, ఆలివ్‌ ఆయిల్‌ - 2 టీ స్పూన్లు, కార్న్‌ఫ్లోర్‌ - 1 టేబుల్‌ స్పూన్, బియ్యప్పిండి - అర టేబుల్‌ స్పూన్, నూనె - వేయించడానికి సరిపడా. 
తయారుచేసే విధానం:
 పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి, సన్నగా తరగాలి. వీటన్నిటినీ మిక్సీ జార్‌లో వేసి మరీ మెత్తగా కాకుండా గ్రైండ్‌ చేసుకోవాలి. చేప ముక్కల్ని ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ పిండేయాలి. కడిగి పెట్టిన చేపముక్కల్లో పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లంవెల్లుల్లి పేస్ట్‌, ఉప్పు, కారం, మిరియాల పొడి, గ్రైండ్‌ చేసి పెట్టిన గ్రీన్ మసాలా పేస్ట్‌ వేయాలి. మసాలా పొడులు, గ్రీన్ మసాలా పేస్ట్‌ అన్నీ ముక్కలకి బాగా పట్టేలా కలపాలి. 2 టీ స్పూన్లు ఆలివ్‌ ఆయిల్‌ వేసి కలపాలి. నిమ్మకాయ రసం కూడా ముక్కలకి పట్టేట్లు కలపాలి. చివరిగా కార్న్‌ఫ్లోర్‌, బియ్యప్పిండి వేసి కలపాలి. మసాలాలన్నీ కలిపిన చేప ముక్కల్ని పావుగంట నానబెడితే మసాలా అంతా ముక్కలకి బాగా పడుతుంది. మారినేట్‌ చేసిన చేపముక్కల్ని బాగా కాగిన నూనెలో మీడియం మంట మీద డీప్‌ఫ్రై చేయాలి. ఉల్లిపాయ, పుదీనా, కొత్తిమీరతో అలంకరించుకుంటే గ్రీన మసాలా ఫిష్‌ ఫ్రై రెడీ.

మటన్‌

మటన్‌
www.srinainika.blogspot.com
కావలసిన పదార్థాలు:
 మటన్‌: కిలో, నెయ్యి లేదా నూనె: పావుకిలో, మటన్‌ ఉడికించిన నీరు: కప్పు, ఉల్లిపాయలు: రెండు పెద్దవి(సన్నగా తరిగి పెట్టుకోవాలి), అల్లం వెల్లుల్లి ముద్ద: మూడు స్పూన్లు, ఉల్లిపాయల ముద్ద: రెండు స్పూన్లు, పసుపు, గరంమసాలా పొడి: చెరో టేబుల్‌ స్పూను, ఎండు మిర్చి: నాలుగు లేక ఐదు, జీలకర్ర పొడి: టేబుల్‌ స్పూను, పెరుగు: వంద గ్రాములు, టమోటాలు: రెండు(సన్నగా తరిగి పెట్టుకోవాలి), నిమ్మరసం: టేబుల్‌ స్పూను, నల్ల మిరియాలు: కొన్ని, చక్కెర: అర టీస్పూను, ఉప్పు: తగినంత, కొత్తిమీర: కొద్దిగా. 
తయారీ విధానం:
  ముందుగా మటన్‌ని శుభ్రం చేసుకుని దానికి పెరుగు, నిమ్మరసం, అల్లంవెల్లుల్లి ముద్ద, ఉల్లి ముద్ద వేసి బాగా కలిపి కనీసం రెండు గంటలు నాననివ్వాలి. మందపాటి గిన్నెలో నెయ్యి లేదా నూనె వేసి ఎండుమిర్చి వేయించుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత జీలకర్రపొడితో కలిపి మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన నెయ్యి వేసుకుని కాగిన తరువాత ఉల్లిపాయలు, జీలకర్ర మిశ్రమాన్ని వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మటన్‌ వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. మటన్‌ కొద్దిగా ఉడుకుతున్న సమయంలో టమోటా ముక్కలు, మిరియాలు, మటన్‌ ఉడికించిన నీరు వేసి ఉడికించాలి. దింపే ముందు గరం మసాలా వేసుకొని కొత్తిమీర చల్లుకోవాలి.