కావలసిన పదార్థాలు
మీల్ మేకర్- ఒక కప్పు, కార్న్‌ఫ్లోర్- రెండు టేబుల్ స్పూన్లు, కారం- అర టీ స్పూను, నూనె- వేగించడాని కి సరిపడా. సాస్ తయారీ కోసం: తరిగిన ఉల్లిపాయ, క్యాప్సికమ్- ఒక్కోటి చొప్పున, చిల్లీ సాస్- రెండు టేబుల్ స్పూన్లు, సోయా సాస్- ఒకటిన్నర టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లికాడలు- రెండు, తరిగిన వెల్లుల్లి, పచ్చిమిర్చి- చెరో నాలుగు, నూనె- ఒక టేబుల్ స్పూను, ఉప్పు- తగినంత.
తయారీ విధానం
వేడినీటిలో మీల్ మేకర్‌ను రెండు నిమిషాలు నానబెట్టి, తర్వాత నీటిని మొత్తం పిండేయాలి. తర్వాత వాటిల్లో కార్న్‌ఫ్లోర్, కారం వేసి కలిపి పది నిమిషాలు నాననివ్వాలి. తర్వాత నూనెలో వేగించి పక్కన పెట్టుకోవాలి. సాస్ తయారీ కోసం మరో బాణలిలో నూనె పోసి వేడెక్కాక వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయముక్కలు వేసి ఒక నిమిషం పాటు వేగించాలి. తర్వాత క్యాప్సికమ్, చిల్లీ సాస్, టమోటా సాస్, సోయా సాస్ వేసి బాగా కలపాలి. కొద్దిగా నీళ్లు పోసి దగ్గర పడే వరకూ ఉడికించాలి. చివర్లో మీల్‌మేకర్ వేసి మరో నిమిషం పాటు వేగించి దింపేయాలి. వేడి వేడి సోయా మంచూరియా రెడీ!
No comments:
Post a Comment