CARROT SOUP
కావలసిన పదార్థాలు:
తరిగిన క్యారెట్ - 1 కప్పు, పొట్టు పెసరపప్పు - అరకప్పు, మిరియాలు - 6, ఉల్లి తరుగు - పావు కప్పు, వెల్లుల్లి తరుగు - 1 టీ స్పూను, టమోటా తరుగు - పావు కప్పు, పాలు - ముప్పావు కప్పు, నూనె - 1 టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత.
తయారుచేసే విధానం:
నూనెలో మిరియాలు, ఉల్లి, వెల్లుల్లి తరుగులను 3 నిమిషాలు వేగించాలి. తర్వాత క్యారెట్, టమోటా ముక్కలు కలపాలి. 4 నిమిషాల తర్వాత పెసరపప్పుతో పాటు ఒక కప్పు నీరు పోసి క్యారెట్ ముక్కలు మెత్తబడేవరకు చిన్నమంటపై ఉడికించాలి. మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీలో పేస్టు చేసుకోవాలి. ఈ పేస్టుకి పాలతో పాటు ఒకటిన్నర కప్పు నీరు, ఉప్పు, మిరియాలపొడి కలిపి మరికొద్దిసేపు మరిగించాలి. వేడి వేడిగా ఉన్నప్పుడే బ్రెడ్ క్యూబ్స్ వేసుకుని తాగాలి.
No comments:
Post a Comment