ఉలవచారు
కావలసిన పదార్థాలు:
ఉలవలు - 1 కప్పు, చింతపండు - నిమ్మకాయంత, పచ్చిమిర్చి - 3, ఎండుమిర్చి - 2, కరివేపాకు - 4 రెబ్బలు, జీలకర్ర - అర టీ స్పూను, ఆవాలు - 1 టీ స్పూను, బెల్లం తరుగు - 1 టీ స్పూను.
పొడి కోసం : దనియాలు - 1 టేబుల్ స్పూను, జీలకర్ర - 1 టీ స్పూను, వెలుల్లి రేకలు - 6.
తయారుచేసే విధానం:
ఉలవల్ని ఒక రాత్రంతా నానబెట్టి 8 కప్పుల నీటిలో మెత్తగా ఉడికించి వడకట్టాలి. తర్వాత అరకప్పు ఉలవలను మాత్రమే తీసుకుని పేస్టులా రుబ్బుకోవాలి. కడాయిలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, వేగించి వడకట్టిన నీరు పోసి మరిగించాలి. ఒక పొంగు రాగానే పసుపు, ఉప్పు, బెల్లం, రసం పొడి, ఉలవల పేస్టు, చింతపండు గుజ్జు కలిపి చిన్నమంటపై 20 నిమిషాలు మరిగించాలి. వేడి వేడి అన్నంతో తింటే ఎంతో రుచిగా ఉండే ఉలవచారు ఇది.
No comments:
Post a Comment