www.srinainika.blogspot.com
కావలసిన పదార్థాలు:
మటన్: కిలో, నెయ్యి లేదా నూనె: పావుకిలో, మటన్ ఉడికించిన నీరు: కప్పు, ఉల్లిపాయలు: రెండు పెద్దవి(సన్నగా తరిగి పెట్టుకోవాలి), అల్లం వెల్లుల్లి ముద్ద: మూడు స్పూన్లు, ఉల్లిపాయల ముద్ద: రెండు స్పూన్లు, పసుపు, గరంమసాలా పొడి: చెరో టేబుల్ స్పూను, ఎండు మిర్చి: నాలుగు లేక ఐదు, జీలకర్ర పొడి: టేబుల్ స్పూను, పెరుగు: వంద గ్రాములు, టమోటాలు: రెండు(సన్నగా తరిగి పెట్టుకోవాలి), నిమ్మరసం: టేబుల్ స్పూను, నల్ల మిరియాలు: కొన్ని, చక్కెర: అర టీస్పూను, ఉప్పు: తగినంత, కొత్తిమీర: కొద్దిగా.
తయారీ విధానం:
ముందుగా మటన్‌ని శుభ్రం చేసుకుని దానికి పెరుగు, నిమ్మరసం, అల్లంవెల్లుల్లి ముద్ద, ఉల్లి ముద్ద వేసి బాగా కలిపి కనీసం రెండు గంటలు నాననివ్వాలి. మందపాటి గిన్నెలో నెయ్యి లేదా నూనె వేసి ఎండుమిర్చి వేయించుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత జీలకర్రపొడితో కలిపి మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన నెయ్యి వేసుకుని కాగిన తరువాత ఉల్లిపాయలు, జీలకర్ర మిశ్రమాన్ని వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మటన్ వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. మటన్ కొద్దిగా ఉడుకుతున్న సమయంలో టమోటా ముక్కలు, మిరియాలు, మటన్ ఉడికించిన నీరు వేసి ఉడికించాలి. దింపే ముందు గరం మసాలా వేసుకొని కొత్తిమీర చల్లుకోవాలి.

No comments:
Post a Comment