header

Friday, 18 November 2016

టమోటా దోశలు

టమోటా దోశలు


కావలసిన పదార్థాలు:
 బియ్యం- ఒక కప్పు, మినప్పప్పు- పావు కప్పు, తరిగిన టమోటాలు- నాలుగు, మెంతులు- పావు టీ స్పూను, సోడా ఉప్పు- అర టీ స్పూను, నూనె లేదా నెయ్యి- సరిపడా, ఉప్పు- తగినంత.

తయారీ విధానం:
 బియ్యం, మినప్పప్పు, మెంతులను 3 గంటలు నానబెట్టుకుని ముందురోజు రాత్రి రుబ్బి ఉంచుకోవాలి. మర్నాడు బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి టమోటా ముక్కలను వేగించి మెత్తగా రుబ్బుకోవాలి. దోశల పిండిలో టమోటా గుజ్జు, సోడా ఉప్పు వేసి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత పెనంపై నెయ్యి లేదా నూనెతో దోశలు వేసుకోవాలి. ఇవి ఆరెంజ్‌ రంగులో ఆకర్షణీయంగా ఉంటాయి.

No comments:

Post a Comment