బేబీకార్న్ మసాలా కర్రీ
కావలసిన పదార్థాలు:
బేబీకార్న్- 200 గ్రా., నూనె- పావు కప్పు, జీలకర్ర- ఒక టీ స్పూను, బిర్యానీ ఆకు- ఒకటి, అల్లంవెల్లుల్లి ముద్ద- 2 టీ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయలు- అర కప్పు, తరిగిన టమోటాలు- ఒక కప్పు, గరం మసాలా- పావు టీ స్పూను, కారం- ఒక టీ స్పూను, దనియాల పొడి- ఒక టీ స్పూను, ఉప్పు- తగినంత.
తయారీ విధానం:
ఒక బాణలిలో నూనె పోసి వేడెక్కాక జీలకర్ర, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేగించాలి. ఉల్లిపాయ ముక్కలు వేసి వేగిన తర్వాత టమోట ముక్కలు కూడా వేసి 10 నిమిషాలు వేగించాలి. తర్వాత ఉప్పు, గరం మసాలా, కారం, బేబీకార్న్ ముక్కలు వేసి బాగా కలిపి మరో 5 నిమిషాలు ఉడికించాలి. కొత్త రుచితో ఘుమఘుమలాడే బేబీకార్న్ మసాలా కర్రీ రెడీ!
No comments:
Post a Comment