header

Friday, 18 November 2016

క్యారెట్‌ మురుకుల

క్యారెట్‌ మురుకుల


కావలసిన పదార్థాలు:
 క్యారెట్‌ తురుము- ఒక కప్పు, బియ్యప్పిండి- ఒక కప్పు, వేగించిన శనగపప్పు- అర కప్పు, వేగించిన మినప్పప్పు- ఒక టేబుల్‌ స్పూను, మిరియాలు- ఒక టేబుల్‌ స్పూను, నెయ్యి- మూడు టేబుల్‌ స్పూన్లు, ఇంగువ- పావు టీ స్పూను, నువ్వులు- ఒక టీ స్పూను, నూనె- వేగించడానికి సరిపడా, ఉప్పు- తగినంత. 
తయారీ విధానం:
 క్యారెట్‌ తురుమును మెత్తగా ఉడికించి, రుబ్బుకోవాలి. తర్వాత వేగించిన శనగపప్పు, మినప్పప్పు, మిరియాలను కలిపి మెత్తగా పొడిచేసుకోవాలి. ఈ మిశ్రమంలో బియ్యప్పిండి, క్యారెట్‌ తురుము, నువ్వులు, నెయ్యి, ఇంగువ, తగినంత ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. బాణలిలో నూనె పోసి వేడెక్కాక ఈ పిండిని మురుకుల గిద్దతో మనకు నచ్చిన ఆకారంలో వేసుకొని కాల్చుకోవాలి.

No comments:

Post a Comment