header

Friday, 21 October 2016

మైసూరు బజ్జి ,MYSORE BAJJI

మైసూరు బజ్జి


కావలసిన పదార్దాలు :
1) మినప పప్పు : 100 గ్రాములు
2) మైదా : 1/4 కేజీ 
3) వంట షోడా : చటికెడు
4) ఉప్పు : తగినంత 
తయారు చేయు విధానం :

మినపపప్పుని మూడు గంటలు నానబెట్టి, మెత్తగా రుబ్బుకోవాలి. దానిలో శుబ్రం చేసిన మైదా పిండిని కలిపి మరల మరో నాలుగు గంటలు నాననివ్వాలి. ఇలా సిద్ధం చేసిన పిండిలో కొద్దిగా వంట షోడా కలిపి, సన్నగా కాగిన నూనెలో గుండ్రని ఆకారంలో దోరగా వేయించాలి.

                                                                       BY:www.srinainika.blogspot.com

TOMATO UPMA


టమాటా ఉప్మా


కావలసిన పదార్ధాలు : 

ఉప్మారవ్వ : పావుకిలో 
నూనె : అరకప్పు 
టమాట గుజ్జు : కప్పు
ఎండిమిర్చి : రెండు
ఆవాలు : టీ స్పూన్ 
సెనగపప్పు : టీ స్పూన్ 
జీడిపప్పులు : పది 
పల్లీలు : కొద్దిగా 
నూనె : అరకప్పు 
నెయ్యి : టేబుల్ స్పూన్ 
ఉల్లిముక్కలు, పచ్చిమిర్చిముక్కలు, అల్లం ముక్కలు అన్ని కలిపి : 1 కప్పు 
కరివేపాకు : కొద్దిగా 
ఉప్పు : తగినంత 
నిమ్మరసం : 1 టీ స్పూన్ 
కొత్తిమిర : కొద్దిగా 
 
తయారుచేయు విధానం :
 
1) స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేడిచేయ్యాలి.
2) నూనె కాగిన తరువాత సెనగపప్పు, పల్లీలు, జీడిపప్పువేసి వేగాక, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగిన తరువాత ఉల్లి, మిర్చి, అల్లం ముక్కలు వేసి వేగనివ్వాలి.
3) వేగాక టామాటగుజ్జు వేసి కలిపి, రెండు గ్లాసుల నీళ్ళుపోసి ఉప్పు కలిపి మూతపెట్టాలి. నీళ్ళు మరుగుతుండగా మూతతీసి రవ్వపోస్తూ బాగాకలిపి గట్టి పడ్డాక స్టవ్ ఆపాలి.
4) ఇప్పుడు నెయ్యి, నిమ్మరసం వేసి కలిపి కొత్తిమిర వేసి మూత పెట్టాలి.

                                                BY:www.srinainika.blogspot.com

UPMA RAVA IDLY

ఉప్మారవ్వ ఇడ్లి


కావలసిన పదార్ధాలు :

ఉప్మా రవ్వ : పావుకేజీ 
పెరుగు : కప్పు
వంటసోడా : చికెడు 
పచ్చిమిర్చి : నాలుగు 
కొత్తిమిర : కట్ట 
నూనె : రెండు టేబుల్ స్పూన్లు 
ఆవాలు : టీ స్పూన్ 
పసుపు : పావు టీ స్పూన్ 
టమాట గుజ్జు : అర కప్పు 
పోపుదినుసులు : టీ స్పూన్ 
నెయ్యి : రెండు టీ స్పూన్లు 


తయారుచేయు విధానం :
1) స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేడి చేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి 
    ముక్కలు, కరివేపాకు, పోపుదినుసులు వేసి వేగాక రవ్వ వేసి వేపాలి.  
2) చల్లారిన తరువాత ఉప్పు, పెరుగు, సోడా, టమాట గుజ్జు కలిపి ఒక 
    గంటన్నర పక్కనపెట్టాలి. 
3) ఇప్పుడు ఇడ్లి పాత్రలో నీళ్ళుపోసి స్టవ్ మీద పెట్టాలి. ఇడ్లి రేకులకు  
    నూనె రాసి పిండిని రేకుల్లో వేసి ఇడ్లి పాత్రలో పెట్టి మూతపెట్టాలి.


* పది నిముషాల్లో ఉప్మారవ్వఇడ్లి రెడి.

                                                  BY:www.srinainika.blogspot.com

BEETROOT UPMA

బీట్రూట్ ఉప్మా 

కావలసిన పదార్ధాలు :


ఉప్మారవ్వ : పావుకిలో 
నూనె : అరకప్పు 
బీట్రూట్ తురుము : అర కప్పు 
ఎండిమిర్చి: రెండు
ఆవాలు : టీ స్పూన్ 
సెనగపప్పు : టీ స్పూన్ 
జీడిపప్పులు : పది 
పల్లీలు : కొద్దిగా 
నూనె : అరకప్పు 
నెయ్యి : టేబుల్ స్పూన్ 
ఉల్లిముక్కలు, పచ్చిమిర్చిముక్కలు, అల్లం ముక్కలు అన్ని కలిపి : 1 కప్పు 
కరివేపాకు : కొద్దిగా 
ఉప్పు : తగినంత  
నిమ్మరసం : టీ స్పూన్ 
కొత్తిమిర : కొద్దిగా 
జీలకర్ర : అర టీ స్పూన్ 
మినపప్పు : టీ స్పూన్ 


తయారుచేయు విధానం : 
 
1) స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి.
2) నూనె కాగాక, సెనగపప్పు, పల్లీలు, జీడిపప్పు, మినపప్పు, జీలకర్ర వేసి వేగాక ఎండిమిర్చి, కరివేపాకు వేసి  వేగాక, ఉల్లి, మిర్చి, అల్లం ముక్కలు వేసి వేగనివ్వాలి.
3) ఇప్పుడు బీట్రూట్ తురుము కుడా వేసి కలిపి, రెండు గ్లాసుల నీళ్ళు, ఉప్పు వేసి మూతపెట్టాలి. నీళ్ళు మరుగుతుండగా మూతతీసి రవ్వ పోస్తూ బాగాకలిపి గట్టి పడ్డాక స్టవ్ ఆపాలి.
4) ఇప్పుడు నెయ్యి, నిమ్మరసం వేసి కలిపి కొత్తిమిర వేసి మూత పెట్టాలి.


* అంతే బీట్రూట్ (ఎరుపు కలర్) ఉప్మా రెడి.

                                                  BY:www.srinainika.blogspot.com

POORI

పూరి

కావలసిన పదార్దములు :

గోధుమ పిండి : 1 కప్పు
మైదా పిండి : 1 కప్పు
నూనె : పావుకేజీ


తయారుచేయు విధానం :
1) గోధుమ పిండి, మైదా పిండి కలిపి నీళ్ళుపోసి ముద్దలా కలిపి, అరగంట పక్కన పెట్టాలి.
2) స్టవ్ వెలిగించి కళాయిపెట్టి నూనె వేడి చెయ్యాలి.
3) ఇప్పుడు పిండి ముద్దను చిన్నచిన్న ఉండలుగా చేసి, ఒక్కో ఉండను పూరిలా చేసి కాగుతున్న నూనెలో వెయ్యాలి. 
4) ఇవి బాగా పొంగుతాయి, రెండో పక్కకుడా వేగనిచ్చి తియ్యాలి.

* అంతే పూరిలు రెడి.
                                                 BY:www.srinainika.blogspot.com

జొన్న దోశలు



కావలసిన పదార్దాలు (Ingredients for Corn Dosa or Jonna Dosa) :

శుబ్రం చేసిన జొన్నలు : రెండు కప్పులు

మినపప్పు : కప్పున్నర 
బియ్యం : అరకప్పు 
వంటసోడా : అర టీ స్పూన్
ఉప్పు : సరిపడా 
నూనె : అరకప్పు 
అల్లం, ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు : కప్పు 
జీలకర్ర : టీ స్పూన్ 

తయారుచేయు విధానం :
(Preparation Method for Jonna Dosa)

1) ఆరు గంటలు ముందు  జొన్నలు, మినపప్పు, బియ్యం విడివిడిగా నానబెట్టాలి.
2) తరువాత నీళ్ళు వంపి మెత్తగా రుబ్బుకోవాలి. దీనిలో ఉప్పు కలిపి రాత్రంతా పక్కనపెట్టాలి.
3) ఉదయానికి ఈ పిండి పులుస్తుంది. కావాలంటే కొద్దిగా నీళ్ళు వేసి పిండిని పలుచగా కలుపుకోవాలి.
4) ఇప్పుడు పిండిలో వంటసోడా కలపాలి.
5) స్టవ్ మీద పాన్ పెట్టి కొంచెం పిండి గరిటతో తీసి పాన్ మీద దోశలా వేసి ఫైన జీలకర్ర, ఉల్లి, మిర్చి,అల్లం ముక్కలు జల్లాలి. ఇవి లేకుండా ప్లెయిన్ కూడా దోశ వేసుకోవచ్చు. దోశ చుట్టూ నూనె వేసి రెండు ప్రక్కలా దోరగా కాల్చాలి.
* అంతే ఎంతో రుచిగా ఉండే జోన్నదోశలు రెడీ.
                                                                                                                                                          BY:www.srinainika.blogspot.com

JEEDI PAPPU UPMA

జీడిపప్పు ఉప్మా
కావలసిన పదార్ధాలు :
 
ఉప్మారవ్వ : పావుకేజీ 
పోపుదినుసులు : కొద్దిగా
జీడిపప్పులు : అరకప్పు 
కరివేపాకు : రెండు రెమ్మలు
ఉల్లిపాయ : ఒకటి 
ఎండుమిర్చి : రెండు
పచ్చిమిర్చి : నాలుగు
అల్లం ముక్కలు : 1 టేబుల్ స్పూన్ 
నూనె : 2 టేబుల్ స్పూన్లు
నీళ్ళు : 3 గ్లాసులు 
 
 
తయారు చేయు విధానం :
 
1) ముందుగా బాండిలో నూనె వేడి చేసి, పోపుదినుసులు వేసి వేగిన తరువాత జీడిపప్పులు వేసి వేగనివ్వాలి.
2) దోరగా వేగాక వెండిమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిముక్కలు, అల్లం ముక్కలు వేసి వేపాలి.
3) అవి వేగాక కరివేపాకు వేసి కలిపి తగినన్ని నీళ్ళు, ఉప్పు వేసి మూతపెట్టాలి.
4) రెండు నిముషాలకి నీళ్ళు మరుగుతాయి అప్పుడు రవ్వవేసి గరిటతో తిప్పాలి. 
5) ఇప్పుడు రవ్వ ఉడికి గట్టిపడుతుంది.
6) స్టవ్ ఆపి కొత్తిమిర జల్లి, మూత పెట్టి ఒక నిముషం ఉంచాలి.
అంతే గుమగుమలాడే జీడిపప్పు ఉప్మా రెడి.
                                               BY:www.srinainika.blogspot.com

PAROTA

పరోట

కావలసిన పదార్దములు :


మైదా : పావుకేజీ
ఉప్పు : తగినంత
నూనె : రెండు టేబుల్ స్పూన్ లు


తయారుచేయు విధానం :


1) మైదాని జల్లించి, ఉప్పు, నీళ్ళువేసి ముద్దలా కలపాలి. దీనిని పది 
    నిముషాలు బాగా కలపాలి .
2) తరువాత పల్చగా చపాతిలా చెయ్యాలి. అలా చేసిన దానిమీద నూనె వేసి 
    చపాతీ మొత్తం రాయాలి.
3) దీనిని ఒక మడత కిందికి, ఒక మడత పైకి అంగుళం వెడల్పుగా మడత 
    పెట్టాలి. అలా సన్నగా చపాతీ మొత్తం మడత పెట్టి, దానిని రౌండ్ గా చుట్టి, 
    టేబుల్ మీద చేతితో చుట్టూ నొక్కి, మందంగా మరల చపాతిలా చేసి పాన్ 
    మీద రెండు ప్రక్కలా కాల్చాలి.
4) అలా మొత్తం పరోటాలు కాల్చాక, ఒక దాని మీద ఒకటి పెట్టి రెండు 
    చేతులతో అంచులు ఒకటి, రెండు సార్లు దగ్గరకు నొక్కితే పరోటా 
    పొరలుపొరలుగా వుంటుంది. 

                                                BY: www.srinainika.blogspot.com

MILLET FLOUR IDLY

రాగిపిండి ఇడ్లి

By:www.srinainika.blogspot.com



కావలసిన పదార్ధాలు : 


మినపప్పు : వంద గ్రాములు
బియ్యపురవ్వ : వంద గ్రాములు 
రాగిపిండి : వంద గ్రాములు 
ఉప్పు : తగినంత 


తయారుచేయు విధానం :

1) మినపప్పును ఐదు గంటలు నానబెట్టి, కడిగి మెత్తగా రుబ్బాలి. దీనిలో 
    రాగిపిండి, కడిగి నీళ్ళు, పిండిన బియ్యపురవ్వను రుబ్బినపిండిలో కలిపి 
    ఐదు గంటలు పులియనివ్వాలి. 
2) ఇడ్లి వేసేముందు ఉప్పు, కొంచెం వంటసోడా కలిపి, స్టవ్ వెలిగించి ఇడ్లి 
    పాత్ర లో కొద్దిగా నీళ్ళు పోసి ఇడ్లి రేకులో ఇడ్లిలా వేసి పావుగంట 
    ఉడకనివ్వాలి.


* అంతే రాగి ఇడ్లి రెడి.

SENAGAPINDI IDLLY

Telugu Recipes : Senagapindi Idly (శెనగపిండితో ఇడ్లి)





కావలసిన పదార్ధాలు :

సెనగపిండి : పావుకేజీ
పెరుగు : కప్పు
వంటసోడా : చికెడు
పచ్చిమిర్చి : నాలుగు
కొత్తిమిర  : కట్ట
నూనె : రెండు టేబుల్ స్పూన్లు
ఆవాలు : టీ స్పూన్
పసుపు : పావు టీ స్పూన్
జీలకర్ర : టీ స్పూన్

తయారుచేయు విధానం :

1) సెనగపిండిలో కొద్దిగా నీళ్ళుపోసి జారుగా కలపాలి. దీనిలోనే ఉప్పు,
పెరుగు, నూనె, పసుపు, కొత్తిమిర వేసి కలిపి, ఒక గంటన్నర
పక్కనపెట్టాలి.
2) ఇప్పుడు ఇడ్లి పాత్ర లో నీళ్ళుపోసి స్టవ్ మీద పెట్టాలి. ఇడ్లి పిండిలో సోడా
వేసి బాగా కలిపి, ఇడ్లి రేకులకు నూనె రాసి పిండిని రేకుల్లో వేసి ఇడ్లి
పాత్రలో పెట్టి మూతపెట్టాలి. పది నిముషాల్లో సెనగ పిండి ఇడ్లి రెడి.
3) ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర,
పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వేగాక ఒక కప్పు పెరుగు, ఉప్పు
వేసి తాలింపు వేసి ఉడికిన ఇడ్లీల మీద వేసి వడ్డించాలి.


CHICKEN LEG PIECE FRY

చి కె న్  లె గ్ పిస్   ఫ్రై 


కావలసిన పదార్ధాలు :
 
చికెన్ లెగ్స్ : రెండు లేదా  మూడు 
అల్లం-వెల్లుల్లి పేస్టు : టి. స్పూన్లు
ఉప్పు : తగినంత
కారం : అర టేబుల్ స్పూన్
నూనె : పావుకిలో
గరం మసాల : అర టి స్పూన్
దనియాల పొడి : 1 టి స్పూన్
పసుపు : పావు టి స్పూన్
పచ్చిమిర్చి :మూడు 
కొత్తిమీర : కొద్దిగా 
తయారుచేయు విధానం :
 
1) ముందుగా  అల్లంవెల్లుల్లి, కారం, ఉప్పు, పసుపు,  గరం మసాల, ధనియాల పొడి, కొత్తిమీర, పచ్చిమిర్చి  అన్నీ కలిపి ముద్దలా చేసి (మిశ్రమంలా) పక్కనపెట్టాలి.
2) ఇప్పుడు చికెన్ లెగ్స్ కి చాకుతో ఘాట్లు పెట్టి, సిద్డం చేసుకున్న మిశ్రమాన్ని పట్టించి గంట పక్కనపెట్టాలి.
3) ఇప్పుడు స్టవ్ పై కళాయిపెట్టి నూనె వేడిచేయ్యాలి. మసాలతో వున్న చికెన్ లెగ్స్ని కాగిననూనెలో వేసి బాగా వేపి తియ్యాలి.
4) వీటిని నిమ్మకాయ ముక్కలుతో ఉల్లి ముక్కలతో అలంకరించాలి. 
అంతే చికెన్ లెగ్స్ వేపుడు రెడి. 

ONION BAJJI

 ఉల్లిపాయ బజ్జి

కావలసిన పదార్ధాలు :

ఉల్లిపాయలు : రెండు (పెద్దవి)
సెనగపిండి : పావుకేజీ
వామ్ము : టేబుల్ స్పూన్
ఉప్పు : తగినంత
నూనె : పావుకేజీ
కారం : అర టీ స్పూన్
వంటసోడా : చిటికెడు

తయారుచేయు విధానం :

1) ఉల్లిపాయలు గుండ్రంగా కట్ చేసుకోవాలి.
2) సెనగపిండిని ఒక గిన్నెలో వేసి దానిలో ఉప్పు, కారం, వంటసోడ, వామ్ము కలిపి, నీళ్ళుపోసి పలుచగా (జారుగా) కలపాలి.
3) ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయిలో నూనె వేడి చెయ్యాలి. నూనె కాగాక గుండ్రంగా కట్ చేసిన ఉల్లి చక్రాలను సెనగపిండిలో ముంచి కాగేనూనెలో వెయ్యాలి.
4) వీటిని దోరగా రెండు ప్రక్కలా వేపి, వేగిన తరువాత పేపరు పరచిన ప్లేట్లోకి
* ఇవి టమాట పచ్చడితో తింటే రుచిగా వుంటాయి.

COCONUT RICE

  


 Coconut Rice | Thengai Sadam  is a very simple dish ,can be done quickly. An ideal dish for lunch box,which i normally prepare once a week. Generally it is made in South Indian houses on the occasion of aadi 18 and Kannu pongal. Check out other south Indian rice varieties, Iyengar Puliyodarai and Pudina rice.



Coconut rice recipe


     Coconut grated   4 tblsp
     Raw rice | basmati rice   1/2 cup
     Coconut oil   1 tsp
     Cooking oil  1 tsp
     Ghee  1/2 tsp
     Mustard seeds   1/4 tsp
     Channa dal   1 tsp
     Urad dal  1 tblsp
     Fried gram  1 tsp
     Green chili  2
     Red chili  1
     Salt   as needed
     Raw peanuts   1 tblsp
     



Method: 
  • Cook rice and allow it to cool. The grains should not be sticky.
  • In a kadai,add the cooking oil and temper the mustard seeds,channa dal, peanuts, fried gram,urad dhal and red chili, green chilli. When it is done add it on the top of the rice.



  • Add the ghee in the same kadai and fry the scrapped coconut till golden brown. Keep a close watch ,it shouldn't get burnt.

  • Add salt to it. Mix it along with the rice and smear the coconut oil and mix gently.
  • Add a few curry leaves.Serve with pappad/vadagam/avial                                                                                                                                                                                                                                              www.thanuram.blogspot.com