header

Sunday, 20 November 2016

Jigarthanda drink

Jigarthanda drink recipe

  • Prep time: 
  • Cook time: 
  • Serves: 3

Main Ingredients:

  1. milk
  2. badam pisin

Ingredients

  • Badam pisin - 1 tsp or 4-5 small pieces (almond gum)
  • Milk - 4 1/2 cups, full fat milk
  • Nannari sharbat - 3 tbsps (sarsaparilla root syrup)
  • Ice cream - 3 scoops (made from reduced milk) OR store bought vanilla ice cream
  • Sugar - 3 tbsps (adjust)

Method

  1. Soak badam pisin in 1 1/4 cups of water overnight. Next day, it will swell and form a transparent jelly like consistency. Remove any impurities if any.
  2. Bring full fat milk to a boil and reduce to almost half its original quantity. You will have 2 1/4 cups of reduced milk. Turn off flame, add 3 tbsps of sugar and mix till dissolved. Bring to room temperature and chill in fridge till use.
  3. To assemble the drink, take three tall glasses. Add a generous tbsp of the badam pisin in each glass followed by a drizzle a generous tbsp of nannari syrup. Divide the sweetened milk among the three glasses till three fourth full.
  4. Top with a scoop of reduced milk ice cream or store bought vanilla ice cream and serve immediately.

Tips

  • Make reduced milk the earlier day and chill in the fridge overnight.
  • Make ice cream the earlier day and freeze.
  • You can replace nannari syrup with rose syrup/rooh afza.
  • You can use agar agar (china grass) instead of badam pisin, if you do not have access to almond gum/badam gond. If using agar agar, soak a fistful in 1/3 cup of warm sugar syrup till they form into a jelly and use in place of badam pisin.
  • Badam pisin is available in native ayurvedic medicine stores.
  • I have used homemade ice cream. You can use store bought vanilla ice cream.
  • In case the drink does not have a light brown shade, you can also achieve it by adding caramalized sugar to the reduced milk.

Coconut Samosa Kobbari Samosa (కొబ్బరి సమోసా)

Coconut Samosa \Kobbari Samosa (కొబ్బరి సమోసా)


కావలసిన పదార్దములు :

జీడిపప్పులు, బాదం పప్పులు, పిస్తా పప్పులు (చిన్నగా కట్ చేసినవి) : 1 కప్పు
కొబ్బరి కాయ : ఒకటి
పంచదార : మూడు  కప్పులు
మిల్క్ మెయిడ్ : 1 కప్పు
యాలుకలపొడి : టీ స్పూన్
మైదా : పావు కిలో
నెయ్యి : కప్పు
నూనె : పావుకిలో


తయారు చేయు విధానం :


1) మైదాలో కొద్దిగా పంచదార పొడి, చిటికెడు ఉప్పు, టీ స్పూన్ నెయ్యి వేసి ముద్దలా కలిపి పక్కన పెట్టాలి.
2) ఇప్పుడు కొబ్బరి కోరుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి ఒక గిన్నెపెట్టి దానిలో పంచదార, కొద్దిగా మిల్క్ మైడ్ వేసి తీగపాకం పట్టాలి.
3) పాకంలో కొబ్బరికోరు వేసి గట్టిపడే వరకు కలుపుతూ ఉండాలి. గట్టి పడిన దానిలో యాలుకలపొడి వేసి కలిపి పక్కనపెట్టాలి. దీనిలో చిన్నగా కట్ చేసిన జీడిపప్పులు, బాదాం, పిస్తా పప్పులు వేసి కలిపి పక్కన పెట్టాలి. 
4) ఇప్పుడు మైదాని చిన్నచిన్న ఉండలుగా చేసి చెపాతిచెయ్యాలి. దీనిని మధ్యకు కట్ చేసి ఒక ముక్కను సమోసాలా చుట్టి  దానిలో కొబ్బరి మిశ్రమం పెట్టి మూసి వెయ్యాలి.
5) అలాగే మొత్తం సమోసాలు చేసి పక్కన పెట్టాలి.
6) ఇప్పుడు స్టవ్ మీద నూనె వేడిచేసి తయారు చేసిన సమోసాలు వేసి దోరగా వేయించి తియ్యాలి.
7) ఇప్పుడు పంచదార తీగపాకం పట్టి వేయించిన సమోసాలు పాకంలో వేసి ఐదునిముషాలు వుంచి, తీసి ప్లేటులో పెట్టాలి.

Cabbage Chutney (కేబేజీ పచ్చడి)

Cabbage Chutney (కేబేజీ పచ్చడి)
Ingredients for Cabbage Chutney (కావలసిన పదార్దములు) :

పచ్చిమిర్చి : పది
టమాటాలు : రెండు
కొత్తిమిర : కొద్దిగా
కేబేజీ తరుగు : కప్పు
ఉప్పు : తగినంత
చింతపండు : కొద్దిగా
నూనె : సరిపడా
తాలింపు కోసం : (మినపప్పు, సెనగపప్పు, వెల్లుల్లి, ఎండిమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు)
Preparation Method for Cabbage Chutney (తయారుచేయు విధానము) :

1) స్టవ్ వెలిగించి నూనె వేడి చేసి పచ్చిమిర్చి వేపాలి.
2) అదే నూనేలో టమాట ముక్కలు వేసి కాసేపు మగ్గనిచ్చి దానిలో కొత్తిమిర, కేబేజీ వేపి దించి, చల్లారనివ్వాలి.
3) ఇప్పుడు మిక్సి జార్లో వేసి ఉప్పు, చింతపండు కూడా వేసి మెత్తగా మిక్సి పట్టాలి.
4) పచ్చడి రెడి అయ్యినట్టే, ఇప్పుడు నూనె వేడి చేసి పోపుదినుసులు వేసి వేగాక, పచ్చడిని తాలింపులో వేసి కలపటమే.
* అంతే కేబేజీ పచ్చడి రెడి.

చేపల పులుసు

చేపల పులుసు


కావల్సినవి:
 చేపముక్కలు (శుభ్రం చేసినవి) - 1 కెజి (మీడియం సైజువి), నూనె - 50 గ్రాములు, సాజీర - 10 గ్రాములు, ఆవాలు - 10 గ్రాములు, చింతపండు (పాతది) - 50 గ్రాములు, టమాట - 100 గ్రాములు, కారం - 5 గ్రాములు, పసుపు - టీ స్పూన్‌, ఉల్లిపాయలు - 150 గ్రాములు, జీలకర్ర మెంతుల పొడి - రెండు టీస్పూన్లు, ధనియాలపొడి- రెండు టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - నాలుగు టీస్పూన్లు , కరివేపాకు - ఒకరెబ్బ, పచ్చిమిర్చి - 5 (నిలువుగా కోసినవి), ఉప్పు - రుచికి తగినంత, కొత్తిమీర - తగినంత, చక్కెర - 3 టీస్పూన్లు
తయారీ విధానం:కొద్దిగా నీరుపోసి చింతపండును నానబెట్టాలి. వెడల్పాటి గిన్నె లేదా బాండీలో నూనెపోసి వేడి చేశాక పచ్చిమిర్చి, సాజీర, ఆవాలు, ముక్కలు తరిగిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లిపేస్ట్‌, టమాటాముక్కలు, కారం, ధనియాలపొడి, జీలకర్ర, మెంతులపొడి, పసుపు, కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ కలపాలి. నానబెట్టిన చింతపండును గుజ్జుగా తీసి పై మిశ్రమంలో కలపాలి. ఉప్పు, చక్కెర వేసి చిక్కని గ్రేవీలా తయారయ్యాక చేపముక్కలను ఆ గ్రేవీలో ఒక్కోటి వేసి పైన మూత పెట్టాలి. అయిదు నిమిషాల తర్వాత ముక్కలను రెండోవైపుకు మార్చి మరికొద్దిసేపు ఉడకనివ్వాలి. ముక్కలను ఎక్కువగా కలపవద్దు. చివర్లో కొత్తిమీర ఆకులను చల్లి దించేస్తే ఘుమఘుమలాడే చేపల పులుసు రెడీ. (చేపల పులుసు చేసిన రోజుకంటే మరుసటి రోజు మరింత రుచిగా వుంటుంది.)

ఆలు రైతా

 ఆలు రైతా


కావలసిన పదార్థాలు:
 ఆలు - 2, పెరుగు - 2 కప్పులు, పచ్చిమిర్చి - 2, వెల్లుల్లి - 2 రేకలు, జీరాపొడి - అర టీ స్పూను, పుదీనా ఆకులు - 1 టేబుల్‌ స్పూను, ఉప్పు - రుచికి తగినంత.
తయారుచేసే విధానం:
 ముందుగా ఆలుగడ్డల్ని మెత్తగా ఉడికించి తొక్కతీసి మెదిపి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, పుదీనా, వెల్లుల్లి గ్రైండు చేసుకోవాలి. తర్వాత పెరుగులో మెదిపిన ఆలు గుజ్జు, పుదీనా మిశ్రమం, జీరాపొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ రైతా పరాటాల్లోకి, అన్నంలోకి బాగుంటుంది.

చిలగడదుంప పూరీలు

చిలగడదుంప పూరీలు
www.srinainika.blogspot.com


కావలసిన పదార్ధాలు:
 చిలగడదుంపలు - పావుకిలో ( ఉడికించి తొక్కతీసి బాగా మెదపాలి), బెల్లం తురుము - పావుకప్పు, గోధుమపిండి - కప్పు, ఉప్పు - తగినంత, యాలకుల పొడి - టీ స్పూను, నీరు - పిండి కలపడానికి తగినంత
తయారీ పద్ధతి: 
 ఒక గిన్నెలో కొద్దిగా నీరు, బెల్లంతురుము వేసి గరిటెతో కలిపి కరిగించి వడకట్టాలి. అదే పాత్రలో మెత్తగా చేసిన చిలగడదుంప ముద్ద, యాలకుల పొడి, గోధుమపిండి వేసి బాగా కలపాలి. తగినంత నీరు జతచేసి పూరీ పిండి మాదిరిగా కలిపి అరగంట పాటు పక్కన ఉంచాలి. పిండిని చిన్న ఉండలుగా చేసి పూరీలు ఒత్తుకోవాలి. బాణలిలో తగినంత నూనె పోసి కాగాక, ఒక్కో పూరీ వేసి వేయించి తీయాలి. తియ్యతియ్యని చిలగడదుంప పూరీలు రెడీ.

కొత్తిమీర చపాతీలు

 కొత్తిమీర చపాతీలు


కావలసిన పదార్థాలు:
 గోధుమ పిండి - నాలుగు కప్పులు, వెన్న - ఒక టేబుల్‌ స్పూను, కొత్తిమీర తురుము - ఒక కట్ట, పచ్చిమిరపకాయలు - రెండు, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా. 
తయారుచేయు విధానం:
 కొత్తిమీరని సన్నగా తరగాలి. ఇందులో గోధుమపిండి, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, వెన్న, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసుకుని చపాతి పిండిలా కలుపుకోవాలి. ఒక గంట తర్వాత చపాతీలు చేసుకుని వేడివేడిగా తింటే ఎంతో రుచిగా ఉంటాయి.

మటన్‌ kurma

మటన్‌ kurma


కావలసిన పదార్థాలు:
 నూనె- అరకప్పు, ఉల్లిపాయ (తరిగి)- ఒకటి, మటన్‌- ముప్పావు కేజీ, పెరుగు- నాలుగు టీస్పూన్లు, నీళ్లు- ఒక కప్పు, ధనియాల పొడి- రెండు టీస్పూన్లు, కారం- ఒక టీస్పూను, ఉప్పు- తగినంత, అల్లం వెల్లుల్లి పేస్టు- రెండు టీస్పూన్లు, లవంగాలు- నాలుగు, యాలకలు- రెండు, దాల్చినచెక్క- మూడు అంగుళాలు, వేగించిన ఉల్లిపాయ ముక్కలు- రెండు టీస్పూన్లు. 
తయారీ విధానం: 
ఒక గిన్నెలో నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అవి వేగిన తరువాత మటన్‌, పెరుగు, ఉప్పు, నీళ్లు, ధనియాల పొడి, కారం వేసి బాగా కలపాలి. కొద్దిసేపటి తరువాత అల్లంవెల్లుల్లి పేస్టు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకలు వేసి సన్నటి మంటపై అరగంట ఉడికించాలి. తరువాత వేగించుకున్న ఉల్లిపాయలు వేసి మటన్‌ ముక్కలు మెత్తబడే వరకు ఉడికించాలి. దీన్ని చపాతీ, రోటీలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది.

సొర చేప పొడి

సొర చేప పొడి



కావలసిన పదార్థాలు:
 సొర చేపలు - 2, ఉల్లి ముక్కలు - 1 కప్పు, పచ్చిమిర్చి - 4, ఆవాలు, మినప్పప్పు - చెరొక స్పూను, జీలకర్ర - 1 టీస్పూను. అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 2 టీస్పూన్లు, గరం మసాలా - 1 టీస్పూను, పసుపు - 1 టీస్పూను, ఉప్పు - తగినంత, కొత్తిమీర - 1 కట్ట, నూనె - 2 టే.స్పూన్లు
తయారీ విధానం: 
గిన్నెలో చేప ముక్కలు, ఉప్పు, పసుపు, చేపలు మునిగేటన్ని నీళ్లు పోసి 10 నిమిషాలు ఉడికించాలి. ఉడికిన తర్వాత ముక్కల్ని చిదిమి పక్కనుంచాలి. కడాయిలో నూనె పోసి మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తర్వాత ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తర్వాత అల్లంవెల్లుల్లి పేస్ట్‌ వేసి పచ్చివాసన పోయేవరకూ వేయించాలి. పసుపు, గరం మసాలా, ఉప్పు వేసి కలపాలి. తర్వాత కొత్తిమీర తరుగు వేసి కలిపి చేప పొడి వేయాలి. బాగా కలిపి చిన్న మంట మీద 5 నిమిషాలు మగ్గనివ్వాలి.

గ్రీన్ మసాలా ఫిష్‌ ఫ్రై

గ్రీన్ మసాలా ఫిష్‌ ఫ్రై


కావలసిన పదార్థాలు:
 పచ్చి చేప ముక్కలు, గ్రీన్ మసాలా పేస్ట్‌ కోసం: పుదీనా - అర కట్ట, కొత్తిమీర - అరకట్ట, కరివేపాకు - 2 రెమ్మలు, పచ్చిమిర్చి -3, మసాలా కోసం: పసుపు - అర టీ స్పూను, గరం మసాలా - 1 టీ స్పూన్, ధనియాలపొడి - 1 టీ స్పూన్, జీలకర్ర పొడి - అర టీ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 1 టీ స్పూన్, కారం - 1 టీ స్పూన్, మిరియాల పొడి - అర టీ స్పూన్, ఉప్పు - రుచికి సరిపడా, నిమ్మకాయ - 1, ఆలివ్‌ ఆయిల్‌ - 2 టీ స్పూన్లు, కార్న్‌ఫ్లోర్‌ - 1 టేబుల్‌ స్పూన్, బియ్యప్పిండి - అర టేబుల్‌ స్పూన్, నూనె - వేయించడానికి సరిపడా. 
తయారుచేసే విధానం:
 పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి, సన్నగా తరగాలి. వీటన్నిటినీ మిక్సీ జార్‌లో వేసి మరీ మెత్తగా కాకుండా గ్రైండ్‌ చేసుకోవాలి. చేప ముక్కల్ని ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ పిండేయాలి. కడిగి పెట్టిన చేపముక్కల్లో పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లంవెల్లుల్లి పేస్ట్‌, ఉప్పు, కారం, మిరియాల పొడి, గ్రైండ్‌ చేసి పెట్టిన గ్రీన్ మసాలా పేస్ట్‌ వేయాలి. మసాలా పొడులు, గ్రీన్ మసాలా పేస్ట్‌ అన్నీ ముక్కలకి బాగా పట్టేలా కలపాలి. 2 టీ స్పూన్లు ఆలివ్‌ ఆయిల్‌ వేసి కలపాలి. నిమ్మకాయ రసం కూడా ముక్కలకి పట్టేట్లు కలపాలి. చివరిగా కార్న్‌ఫ్లోర్‌, బియ్యప్పిండి వేసి కలపాలి. మసాలాలన్నీ కలిపిన చేప ముక్కల్ని పావుగంట నానబెడితే మసాలా అంతా ముక్కలకి బాగా పడుతుంది. మారినేట్‌ చేసిన చేపముక్కల్ని బాగా కాగిన నూనెలో మీడియం మంట మీద డీప్‌ఫ్రై చేయాలి. ఉల్లిపాయ, పుదీనా, కొత్తిమీరతో అలంకరించుకుంటే గ్రీన మసాలా ఫిష్‌ ఫ్రై రెడీ.

మటన్‌

మటన్‌
www.srinainika.blogspot.com
కావలసిన పదార్థాలు:
 మటన్‌: కిలో, నెయ్యి లేదా నూనె: పావుకిలో, మటన్‌ ఉడికించిన నీరు: కప్పు, ఉల్లిపాయలు: రెండు పెద్దవి(సన్నగా తరిగి పెట్టుకోవాలి), అల్లం వెల్లుల్లి ముద్ద: మూడు స్పూన్లు, ఉల్లిపాయల ముద్ద: రెండు స్పూన్లు, పసుపు, గరంమసాలా పొడి: చెరో టేబుల్‌ స్పూను, ఎండు మిర్చి: నాలుగు లేక ఐదు, జీలకర్ర పొడి: టేబుల్‌ స్పూను, పెరుగు: వంద గ్రాములు, టమోటాలు: రెండు(సన్నగా తరిగి పెట్టుకోవాలి), నిమ్మరసం: టేబుల్‌ స్పూను, నల్ల మిరియాలు: కొన్ని, చక్కెర: అర టీస్పూను, ఉప్పు: తగినంత, కొత్తిమీర: కొద్దిగా. 
తయారీ విధానం:
  ముందుగా మటన్‌ని శుభ్రం చేసుకుని దానికి పెరుగు, నిమ్మరసం, అల్లంవెల్లుల్లి ముద్ద, ఉల్లి ముద్ద వేసి బాగా కలిపి కనీసం రెండు గంటలు నాననివ్వాలి. మందపాటి గిన్నెలో నెయ్యి లేదా నూనె వేసి ఎండుమిర్చి వేయించుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత జీలకర్రపొడితో కలిపి మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన నెయ్యి వేసుకుని కాగిన తరువాత ఉల్లిపాయలు, జీలకర్ర మిశ్రమాన్ని వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మటన్‌ వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. మటన్‌ కొద్దిగా ఉడుకుతున్న సమయంలో టమోటా ముక్కలు, మిరియాలు, మటన్‌ ఉడికించిన నీరు వేసి ఉడికించాలి. దింపే ముందు గరం మసాలా వేసుకొని కొత్తిమీర చల్లుకోవాలి.

Saturday, 19 November 2016

ముర్గ్‌ దమ్‌ బిర్యానీని

ముర్గ్‌ దమ్‌ బిర్యానీని


కావలసినవి:
 బాస్మతి బియ్యం- ఒక కేజీ, చికెన్‌ - ఒక కేజీ (లెగ్‌, చెస్ట్‌పీస్‌లు) ,పెరుగు- 200 గ్రాములు , నిమ్మరసం- మూడు టీ స్పూన్లు ,కారం - 20 గ్రాములు, ధనియాల పొడి- 30 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌- 100 గ్రాములు, ఉప్పు- 50 గ్రాములు, గరంమసాలా- 20 గ్రాములు, రిఫైన్డ్‌ ఆయిల్‌- 100 గ్రాములు, వేగించిన ఉల్లి ముక్కలు (సన్నగా నిలువుగా కోసి.) - 30 గ్రాములు, జీడిపప్పు - కొద్దిగా, కొత్తిమీర తరుగు - 15 గ్రాములు, పుదీనా తరుగు - 15 గ్రాములు
బిర్యానీ ఆకులు- ఐదు గ్రాములు, డాల్డా లేదా నెయ్యి - 150 గ్రాములు, నీళ్లు- ఐదు లీటర్లు. ఈ కొలతలతో వండిన బిర్యానీ ఎనిమిది మందికి సరిపోతుంది.
తయారీ:
 చికెన్‌ను ఒక గిన్నెలో వేసి అందులో నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, గరంమసాలా, వేగించిన ఉల్లి ముక్కలు కొన్ని, పెరుగు, కొత్తిమీర, పుదీనా, ధనియాల పొడి, నూనె వేసి కలపాలి. ఇలా కలిపిన చికెన్‌ని రెండు నుంచి మూడుగంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో నీళ్లుపోసి, గరంమసాలా పొడి వేయాలి. నీళ్లు ఉడుకు పట్టాక కడిగిపెట్టుకున్న బాస్మతి బియ్యం వేసి సగం ఉడికించాక ఎసరు వంపేయాలి. అన్నివైపులా సమానంగా ఉన్న ఒక గిన్నె తీసుకుని నానబెట్టిన చికెన్‌ను ఒక పొరలా వేయాలి. దానిపైన సగం ఉడికిన బియ్యాన్ని వేయాలి. పైన కొంచెం నెయ్యి వేయాలి. ఈ గిన్నెను ఒక తవాపై ఉంచి సన్నటి మంట మీద 25 నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తర్వాత గిన్నె మీద మూత పెట్టి ఆవిరి బయటకు రాకుండా గిన్నెను, మూతను కలిపి మైదాతో మూసేయాలి. మండుతున్న బొగ్గులు మూతమీద వేయాలి. 20 నిమిషాల తర్వాత మూతను తీసి కొత్తిమీర, పుదీనాల తరుగు, జీడిపప్పు, వేగించిన ఉల్లిపాయ ముక్కలతో అలంకరించాలి. ఈ ముర్గ్‌ దమ్‌ బిర్యానీని రైతా, మిర్చి కా సలాన్‌తో కలిపి తింటే బాగుంటుంది.

ఆలు చికెన్‌ బిర్యానీ

ఆలు చికెన్‌ బిర్యానీ



కావలసిన వస్తువులు:
 చికెన్‌: అరకిలో. సగం ఉడికిన అన్నం: ఒకటిన్నర కిలో, ఆలు: నాలుగు లేదా ఐదు(కావలసిన సైజులో ముక్కలు చేసుకోవాలి), దాల్చిన చెక్క: చిన్న ముక్క, యాలకులు: నాలుగు లేక ఐదు, మిరియాలు: కొన్ని, బిర్యానీ ఆకు: కొద్దిగా, పచ్చిమిర్చి: ఎనిమిది, ఉల్లిపాయ ముక్కలు: రెండు కప్పులు, కారం: సరిపడ, నిమ్మరసం: టేబుల్‌ స్పూను, కొత్తిమీర ఆకులు: కప్పు, కుంకుమపువ్వు: కొద్దిగా, ఉప్పు: రుచికి సరిపడ, నూనె: తగినంత, అల్లం వెల్లుల్లి ముద్ద: రెండు స్పూన్లు
తయారీ విధానం: 
ముందుగా బియ్యాన్ని సగం ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఓ పెద్ద గిన్నెలో చికెన్‌ ముక్కలు, కారం, ఉప్పు, నిమ్మరసం, చిటికెడు పసుపువేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీ లేదా పాన్‌లో నూనె వేసి బంగాళాదుంప ముక్కలను కొద్దిగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో పచ్చిమిరపకాయలు, దాల్చినచెక్క, యాలకులు, మిరియాలు, బిర్యానీ ఆకు వేసి దోరగా వేయించుకోవాలి. వీటికి ఉల్లిపాయ ముక్కలు జతచేర్చి మరికొద్దిసేపు వేయించి అనంతరం అల్లం వెల్లుల్లిముద్ద కూడా జతచేయాలి. అన్నీ వేగిన తరువాత చికెన్‌ ముక్కలు వేసి మరికొద్ది సేపు వేయించి చివరగా బంగాళాదుంప ముక్కలు జతచేయాలి. ఉడికిన అన్నాన్ని రెండు భాగాలుగా చేసుకొని ఒక భాగం మీద వేయించి పెట్టుకున్న మిశ్రమంలో సగభాగాన్ని తీసుకుని లేయర్‌గా పరుచుకోవాలి. దానిపైన మిగతా అన్నం వేసి మిగతా కూరను కూడా పరిచి కుక్కర్‌లో ఒకటి లేదా రెండు విజిల్స్‌ మాత్రమే వచ్చేవరకు ఉంచి దింపేయాలి. చివరగా కొత్తిమీర చల్లుకోవాలి.