header

Wednesday, 26 October 2016

Senagapindi Idly (శెనగపిండితో ఇడ్లి)

 Senagapindi Idly (శెనగపిండితో ఇడ్లి)

కావలసిన పదార్ధాలు :

సెనగపిండి : పావుకేజీ
పెరుగు : కప్పు
వంటసోడా : చికెడు
పచ్చిమిర్చి : నాలుగు
కొత్తిమిర  : కట్ట
నూనె : రెండు టేబుల్ స్పూన్లు
ఆవాలు : టీ స్పూన్
పసుపు : పావు టీ స్పూన్
జీలకర్ర : టీ స్పూన్

తయారుచేయు విధానం :

1) సెనగపిండిలో కొద్దిగా నీళ్ళుపోసి జారుగా కలపాలి. దీనిలోనే ఉప్పు,
పెరుగు, నూనె, పసుపు, కొత్తిమిర వేసి కలిపి, ఒక గంటన్నర
పక్కనపెట్టాలి.
2) ఇప్పుడు ఇడ్లి పాత్ర లో నీళ్ళుపోసి స్టవ్ మీద పెట్టాలి. ఇడ్లి పిండిలో సోడా
వేసి బాగా కలిపి, ఇడ్లి రేకులకు నూనె రాసి పిండిని రేకుల్లో వేసి ఇడ్లి
పాత్రలో పెట్టి మూతపెట్టాలి. పది నిముషాల్లో సెనగ పిండి ఇడ్లి రెడి.
3) ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర,
పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వేగాక ఒక కప్పు పెరుగు, ఉప్పు
వేసి తాలింపు వేసి ఉడికిన ఇడ్లీల మీద వేసి వడ్డించాలి.

No comments:

Post a Comment