header

Saturday 22 October 2016

Coconut Poori, Kobbari Puri (కొబ్బరి పూరీ)

Coconut Poori, Kobbari Puri (కొబ్బరి పూరీ)

Ingredients (కావలసిన పదార్దములు) :

కొబ్బరి తురుము : కప్పు
పంచదార : మూడు కప్పులు
మైదా : రెండు కప్పులు
నూనె : నాలుగు కప్పులు
యాలకులు పొడి : టీ స్పూన్
జీడిపప్పులు, బాదం పప్పులు : కప్పు

Preparation Method (తయారుచేయు విధానం) :

1) మైదాను కొద్దిగా నీళ్ళు పోసి పూరీ పిండిలా కలిపి అరగంట పక్కన పెట్టాలి. జీడిపప్పులు, బాదాం పప్పులు చిన్నచిన్న ముక్కలుగా చేసి పక్కనపెట్టాలి.
2) స్టవ్ వెలిగించి బాణలి పెట్టి కొబ్బరి తురుము, కప్పు పంచదార వేసి కలుపుకోవాలి. పంచదార కరిగి కొబ్బరి ఉడుకుతుంది. కొబ్బరి, పంచదార కలిసి ముద్దగా అవ్వుతుండగా యాలకుల పొడి, జీడిపప్పుముక్కలు వేసి  స్టవ్ మీద నుండి దించి చల్లారనివ్వాలి.
3) స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి. కలిపిన మైదాను చిన్నచిన్న ఉండలుగా చేసి పూరీలా ఒత్తి, దీనిఫై కొబ్బరి మిశ్రంమం పెట్టి, పైన వేరే పూరీ పెట్టి చుట్టూ అంచులు నొక్కాలి.
4) ఇలా అన్నీ చేసుకొని కాగే నూనెలో దోరగా వేపి తియ్యాలి.
5) ఇప్పుడు మిగిలిన మూడు కప్పుల పంచదారలో  కొద్దిగా నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి పాకం పట్టాలి. తీగపాకం వచ్చాక స్టవ్ ఆపి వేయించిన కొబ్బరి పూరీలను వేసి రెండు నిముషాలు ఉంచి వేరే ప్లేటులో పెట్టుకోవాలి. అరగంట ఆగి డబ్బాలో పెట్టి నిల్వ చేసుకో వచ్చు.
* అంతే స్వీట్ పూరీలు రెడీ.
                                                                                                        www.srinainika.blogspot.com

No comments:

Post a Comment