header

Monday 21 November 2016

కాకరకాయ పప్పు

కాకరకాయ పప్పు


కావలసిన పదార్థాలు: 
 కాకరకాయలు - 2, శనగలు - గుప్పెడు, మినప్పప్పు, దనియాలు - 1 టేబుల్‌ స్పూను చొప్పున, శనగపప్పు - అర టేబుల్‌ స్పూను, ఎండు మిర్చి - 4, ఉడికించిన కందిపప్పు - 1 కప్పు, ఇంగువ - చిటికెడు, కొబ్బరి తురుము - 2 టేబుల్‌ స్పూన్లు, చింతపండు - నిమ్మకాయంత, పసుపు - పావు టీ స్పూను, సాంబారు పొడి, నూనె, ఆవాలు - 1 టీ స్పూను చొప్పున. ఉప్పు - రుచికి తగినంత. 
తయారుచేసే విధానం:
 శనగలను ఒక రాత్రంతా నానబెట్టుకోవాలి. కాకరకాయల్ని చక్రాల్లా తరిగి చిటికెడు పసుపు+ఉప్పు కలిపి శనగలతో పాటు కుక్కర్లో ఉడికించాలి. ఎండుమిర్చి (3), శనగపప్పు, మినప్పప్పు, దనియాలు వేగించి కొబ్బరి తురుముతో పాటు మెత్తగా రుబ్బుకోవాలి. నూనెలో ఆవాలు, ఎండుమిర్చి వేగించాక చింతపండు గుజ్జు, సాంబారు పొడి, ఇంగువ, పసుపు, ఉప్పు ఒకటి తర్వాత ఒకటి కలపాలి. 5 నిమిషాల తర్వాత ఉడికించిన శనగలు, కాకరముక్కలు, పప్పుతో పాటు కొబ్బరి మిశ్రమం కలిపి చిక్కబడ్డాక కరివేపాకు వేసి దించేయాలి.

No comments:

Post a Comment